పూరీ జగన్నాథ్ డైరెక్షన్‌లో, విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన స్పోర్ట్స్ యాక్షన్ ఫిల్మ్ లైగర్. రిలీజైన రోజే మిక్సిడ్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీ అందుకు భిన్నంగా కలెక్షన్లతో దుమ్ము రేపుతుంది. అయితే ఈ సినిమా ఆడియన్స్‌ని ఆకట్టుకోవడంలో ఫెయిలైంది. పూరీ మార్క్ డైరెక్షన్ కనబడలేదని, బాలీవుడ్ ఫ్లాప్ మూవీ చూసిన ఫీలింగ్ కలుగుతుందని అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ సినిమా కోసం విజయ్ పడ్డ కష్టం కోసం, విజయ్ యాక్టింగ్ కోసం చూడాలి తప్ప అంతకు మించి కొత్తదనం ఏమీ లేదని అంటున్నారు.
దీంతో ఈ సినిమా నెల రోజుల తర్వాత ఓటీటీలో వచ్చే అవకాశాలు ఉన్నాయని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాకి సంబంధించిన ఓటీటీ రిలీజ్ డేట్ కూడా వైరల్ అవుతోంది. ఈ సినిమా రిలీజ్‌కు ముందే డిస్నీ+హాట్‌స్టార్ సంస్థ భారీగా చెల్లించి మరీ స్ట్రీమింగ్ హక్కులని సొంతం చేసుకుంది. ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ హక్కులని దాదాపు 65 కోట్లకు డిస్నీ+హాట్‌స్టార్‌కు విక్రయించారని సమచారం. దక్షిణాది భాషలతో పాటు హిందీ ప్రసార హక్కులకు కలిపి ఆ రేటుకి కొన్నట్లు సమాచారం. ఇక తెలుగు శాటిలైట్ రైట్స్‌ను స్టార్ మా ఛానల్ దక్కించుకుందని ప్రచారం జరుగుతోంది.
దీపావళి సందర్బంగా అక్టోబర్ 25న లైగర్ సినిమాని డిస్నీ+హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ చేద్దామని మొదట సదరు సంస్థ భావించిందట. అయితే సినిమాకి మిశ్రమ స్పందన రావడంతో అక్టోబర్ తొలివారంలో స్ట్రీమింగ్ చేయాలనుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. కానీ సినిమా రిలీజైన రెండు నెలల వరకూ ఓటీటీలో స్ట్రీమింగ్ చేయడానికి వీల్లేదని నిర్మాతలు సంగతి తెలిసిందే. మరి లైగర్ మూవీ ఓటీటీలోకి అక్టోబర్ మొదటి వారంలో వస్తుందో లేక దీపావళికి వస్తుందో అనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది. మరోవైపు ఈ సినిమా నెల రోజుల్లోపే ఓటీటీలోకి వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. మరి దీనిపై మీ అభిప్రాయమేంటో కామెంట్ చేయండి.