సీతా రామం.. దుల్కర్ సల్మాన్, రష్మిక మందన్న, మృణాల్ ఠాకూర్ లీడ్ రోల్ లో నటించిన ఈ సినిమా శుక్రవారం విడుదలై సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. యుద్ధం రాసిన ఈ ప్రేమ కథను హృదయంతో చూడాలంటూ ఆకాశానికి ఎత్తేస్తున్నారు. 1965 నుండి 1985 మధ్యలో జరిగిన కథ ఈ సీతా రామం. ప్రేక్షకులంతా ఈ ప్రేమ కథకు ఫిదా అయిపోయారు. ఈ తరుణంలో ఈ సినిమాకి సంబంధించిన క్రేజీ అప్ డేట్ వచ్చింది.
సినిమా హిట్ టాక్ రాగానే.. అది ఎప్పుడు ఓటీటీలోకి వస్తుంది అని అంతా ఎదురు చూస్తుంటారు. అయితే సీతా రామం సినిమా ఏ ఓటీటీలోకి వస్తోంది? ఎప్పుడు వస్తోందని క్లారిటీ ఇచ్చారు. ఈ మూవీ డిజిటల్ రైట్స్ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజామ్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. సరిగ్గా ఆరు వారాల తర్వాత ఈ సినిమా అమెజామ్ ప్రైమ్ స్ట్రీమ్ అవుతుందని చెబుతున్నారు.
ఇంక ఈ సినిమాలో లెఫ్టినెంట్ రామ్ గా దుల్కర్ సల్మాన్ అద్భుతంగా నటించాడు. సీత పాత్రలో మృణాల్ ఠాకూర్ అందరికీ ఆకట్టుకుంది. ఇంక నేషనల్ క్రష్ రష్మిక అయితే కశ్మీరీ ముస్లిం పాత్రలో జీవించేసింది. సుమంత్ తొలుత నెగిటివ్ పాత్రలో కనిపించినా అతని మార్పు సినిమాకే హైలెట్ గా కనిపిస్తుంది. మొత్తానికి సీతా రామం సినిమా తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుందనే చెప్పాలి. సీతా రామం సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.