హర్యానా- ఈ మధ్య యువతీ యువకులు చిన్న విషయాలకే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇంట్లో గొడవల నుంచి మొదలు, ప్రేమ వ్యవహారాలు. చదువుల విషయాల్లో నిరాశ చెంది జీవితాలను చాలించుకుంటున్నారు. కానీ అలా ఆత్మహత్యలు చేసుకుని, కన్నవాళ్లను ఎంత మానసిక క్షోభకు గురిచేస్తున్నారో వాళ్లు అర్ధం చేసుకోవడం లేదు. ఇలాంటి క్రమంలోనే మానసిక ఒత్తిడితో ఓ యువతి మెట్రో రైల్వే స్టేషన్ పై నుంచి దూకేందుకు ప్రయత్నించింది. వెంటనే స్పందించిన పోలీసులు, భద్రతా సిబ్బంది ఆ యువతిని రక్షించారు.
హర్యానాలోని ఫరిదాబాద్ జిల్లాలో ఓ యువతి సెక్టార్ 28 మెట్రో స్టేషన్ మీద నుంచి కిందికి దూకి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది. అనుకున్నదే తడవుగా మెట్రో స్టేషన్ బాల్కానీ రైలింగ్ మీదకు వెళ్లింది. అక్కడి నుంచి భవనం అంచు మీద కూర్చొని కిందకు దూకేందుకు రెడీ అయ్యింది. దీంతో ఆ యువతిని గమనించిన వారు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. మెట్రో స్టేషన్ సమీపంలో విధులు నిర్వహిస్తున్న సబ్ ఇన్స్‌పెక్టర్ ధన్ ప్రకాశ్, కానిస్టేబుల్ సర్ఫరాజ్‌లు వెంటనే మెట్రో స్టేషన్‌కు చేరుకున్నారు.
మెట్రో స్టేషన్ భవనం అంచున కూర్చున్న యువతిని ధన్‌రాజ్ మాటల్లో పెట్టి, ఆమె దృష్టిని మరల్చగా, కానిస్టేబుల్ సర్ఫరాజ్ పై నుంచి ఆ యువతి తగ్గరకు వెళ్లాడు. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఆ యువతి చేయి పట్టుకుని కిందకు దూకకుండా ఆపేశాడు. ఎస్సై ధన్‌రాజ్ సైతం అక్కడికి వెళ్లి యువతిని సురక్షితంగా పైకి తీసుకువచ్చారు. ఢిల్లీకి చెందిన సదరు యువతి ఫరిదాబాద్ సెక్టార్-28లోని సాయిఎక్స్‌పోర్ట్ కంపెనీలో పనిచేస్తున్నట్లు పోలీసుల విచారణలో చేలింది.
పని ఒత్తిడి వల్ల తాను మానసిక ఆందోళనకు గురైన నేపధ్యంలో ఆత్మహత్యకు ప్రయత్నించాాలని ఆమె చెప్పింది. యువతి ఆత్మహత్య ప్రయత్నంతో అక్కడ కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మెట్రో స్టేషన్ కింద రోడ్డుపై నుంచి వెళ్తున్న వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఈ ఘటనను ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
Great Rescue by @FBDPolice . It’s Sec 28, Faridabad, Metro Station.
We should do counseling of this teenage girl so that rather than thinking of suicide she should move ahead in her life. @GenRajan@Cmde_GPrakash @avm_pranaysinha @AshTheWiz @bkum2000 @kayjay34350 pic.twitter.com/91RScdMxrd— Pushpkar Bhardwaj (@pushpkar) July 24, 2021