వినోద్ ఖోస్లా!.. సిలికాన్ వ్యాలీని ప్రభావితం చేసిన ప్రధానమైన వ్యక్తుల్లో ఒకరు. సన్ మైక్రోసిస్టమ్స్ సహవ్యవస్థాపకుల్లో ఒకరు. 1986 లో ప్రారంభించబడిన క్లీనర్, పెర్కిన్స్, కౌఫీల్డ్, బయ్యర్స్ సంస్థలో ప్రధాన వాటాదారు. ప్రస్తుతం ఖోస్లా వుడ్‌సైడ్ కాలిఫోర్నియాలో తన భార్య నీరూ ఖోస్లా, పిల్లలు నీనా, వాణి, అను, నీల్ లతో కలిసి నివాసముంటున్నారు.
మహమ్మారితో పోరాడుతున్న భారత్‌కు ప్రపంచ దేశాలే కాకుండా పలు దేశాల్లో స్థిరపడ్డ ప్రవాసులు కూడా అండగా నిలుస్తున్నారు. ఈ క్రమంలో అమెరికాలో అత్యంత ధనవంతుల్లో ఒకరైన భారత సంతతికి చెందిన వినోద్ ఖోస్లే కూడా స్వదేశానికి సహాయం చేసేందుకు ముందుకొచ్చారు. వైద్య సదుపాయాల కల్పన కోసం 10 మిలియన్ డాలర్లను ఖర్చు చేయనున్నట్టు ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. ఇండియాకు సహాయం చేసేందుకు మరింత మంది ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు.
1980లో స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ పూర్తి చేశాక, సహోధ్యాయులైన స్కాట్ మెకన్లీ, యాండీ బెక్టోల్షీమ్, చాలిఫోర్నియా, బర్కిలీ విశ్వవిద్యాలయానికి చెందిన బిల్ జాయ్ మొదలైనవారితో కలిసి సన్ మైక్రోసిస్టమ్స్ ను స్థాపించారు. 1985లో ఖోస్లా సన్ ను వదిలి వేసి క్లీనర్ పెర్కిన్స్ కాఫీల్డ్ అండ్ బయ్యర్స్ అనే వెంచర్ క్యాపిటలిస్ట్ సంస్థలో భాగస్వామిగా చేరారు.’ఫోర్బ్స్’ 2013 లో అమెరికాలో అత్యంత ధనవంతులైన 400 మందితో కూడిన జాబితాలో వినోద్ ఖోస్లా 352 స్థానంలో నిలిచారు. ఆయన సంపద 1.5 బిలియన్ డాలర్లుగా ఫోర్బ్స్ లెక్కగట్టింది.