చూడ్డానికి అందంగా ఉండే ఆమెలో ఓ రాక్షసి దాగుంది. లవర్ విషయంలో ఆమె అత్యంత దారుణానికి ఒడిగట్టింది. అంతేకాదు! పోలీసులకు సైతం సవాల్ విసిరింది. చివరకు పోలీసులకు చిక్కి జైలు పాలైంది. ఇంతకీ విషయం ఏంటంటే.. గత నెల ఫిబ్రవరి 22వ తేదీన అమెరికాలోని విస్కిన్‌సన్‌కు చెందిన టేలర్ షాబుసినెస్ అనే యువతి.. 25 ఏళ్ల ప్రియుడితో కలిసి అతడి తల్లి ఇంటికి వెళ్లింది. అక్కడ ఇద్దరూ అతిగా డ్రగ్స్ తీసుకుని శృంగారంలో పాల్గొన్నారు. డ్రగ్స్ మత్తులో ఉన్న ఆమె అతడి గొంతు పిసికి చంపేసింది.
అనంతరం అతడి శరీర భాగాలను ముక్కలుగా చేసింది. తలను, పురుషాంగాన్ని కట్ చేసి డబ్బాలో దాచింది. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయింది. మరుసటి రోజు ఉదయం అతడి తల ఓ బకేట్‌లో ఉండటం తల్లి గుర్తించింది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు. మృతుడు చనిపోయే ముందు అతడితో కలిసి ఉన్న టేలర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఆమెను ప్రశ్నించగా షాకింగ్ విషయాలు బయటపెట్టింది. అతడ్ని చంపాలన్న ఉద్ధేశ్యం తనకు లేదని, కేవలం అతడి గొంతును గట్టిగా పిసకటంతో అతడు చనిపోయాడని తెలిపింది.కేవలం సంతోషం కోసమే అతడి గొంతు పిసికానని కూడా వెల్లడించింది.
పోలీసులను ఇబ్బంది పెట్టడానికే అతడి శరీరాన్ని ముక్కలుగా చేసి దాచిపెట్టానని పేర్కొంది. దాచిపెట్టబడిన శరీర భాగాలకోసం పోలీసులు వెతుకుతూ ఉంటే బలే సరదాగా ఉంటుందని అంది. అంతేకాదు! అతడి శరీర భాగాలను అన్నింటిని తనతోనే ఇంటికి తీసుకుపోవాలనుకున్నానని, కానీ, బద్ధకం కారణంగా కొన్ని మాత్రమే వ్యానులో పెట్టి, తలను, పురుషాంగాన్ని ఇంట్లో వదిలేశానని చెప్పింది. కాగా, గత మంగళవారం పోలీసులు ఆమెను కోర్టులో హాజరు పరిచారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు ఆమెను దోషిగా తేల్చింది. మరో సారి విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. మరి.. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.