మధురై- కరోనా మనుషులను పట్టి పీడిస్తోంది. కుటుంబాలకు కుటుంబాలను నామరూపాల్లేకుండా చేస్తోంది. జన జీవనాన్ని కరోనా ఛిన్నాభిన్నం చేస్తోంది. ఓవైపు చాలా మంది కరోనా బారిన పడి కష్టాలపాలవుతోంటే.. మరోవైపు యధావిధిగా కొంత మంది మాత్రం వివాహాది శుభకార్యాలు చేసుకుంటూనే ఉన్నారు. కరోనా నేపధ్యంలో లాక్ డౌన్ ఆంక్షలు ఉన్నా.. పెళ్లిళ్లు మాత్రం ఆగడం లేదు. కొంందరైతే ఏకంగా పీపీఈ కిట్స్ ధరించి ఆస్పత్రిలోనే పెళ్లిళ్లు చేసుకుంటున్నా ఉదంతాలను చూస్తూనే ఉన్నాం. మరి కొంత మంది పోలీసుల నుంతి ప్రత్యేకంగా అనుమతి తీసుకుని అతి కొద్ది మంది సమక్షంలో పెళ్లి చేసుకుంటున్నారు. కానీ చాలా వరకు పెళ్లిళ్లు మాత్రం అనుకున్న ముహూర్తానికి జరిపించేస్తున్నారు పెద్దలు. ఇలాంటి సమయంలో ఓ జంట భూమ్మీద కాకుండా ఏకంగా గాల్లో పెళ్లి చేసుకున్నారు.
అదేంటీ గాల్లో పెళ్లి చేసుకోవడం ఏంటని ఆశ్చర్యపోతున్నారా.. అసలేం జరిగిందంటే.. మధురైకి చెందిన రాకేష్, దక్షిణలు పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ఆ మేరకు పెద్దలు పెళ్లికు ముహూర్తం కూడా పెట్టేశారు. ఇంకేముంది బంధువల సమక్షంలో వారి పెళ్లి వైభవంగా జరిగిపోయింది. ఐతే పెళ్లి జరిగింది మాత్రం ఏ కళ్యామ మంటపంలోనో, గుడిలోనో కాదు.. అసలు భూమ్మీదే కాదంది.. ఈకంగా గాల్లోనే వీరిద్దరి వివాహం జరిగింది. కరోనా దెబ్బకు భయపడి గాల్లో వెళుతున్న విమానంలోనే పెళ్లి కొడుకుపెళ్లి కూతురుకు తాళి కట్టేశాడన్నమాట. మధురైకి చెందిన రాకేష్, దక్షిణల పెళ్లి మంగళవారం జరగాల్సి ఉంది. దీని కోసం ఇరు కుటుంబాల పెద్దలు బెంగళూరు నుంచి మదురైకి వచ్చే విమానంలో బయలు దేరారు.
అయితే కరోనా ప్రభావం ఎక్కువగా ఉండడంతో తమిళనాడు సర్కార్ రేపటి నుంచి రాష్ట్రంలో సంపూర్ణ లాక్‌డౌన్ ప్రకటించింది. దీంతో ఏంచేయాలో పెళ్లి పెద్దలకు అర్ధం కాలేదు. పెళ్లి కోసం చేసుకున్న ఏర్పాట్లనైతే రద్దు చేసుకున్నారు. ఇంతలోనే బంధువుల్లో ఒకరికి వచ్చిన ఐడియా మేరకు ఆ పెళ్లి తంతేదో విమానంలోని కానిస్తే అని అనుకున్నారు. అంతే వెంటనే అప్పటికే సిద్దంగా ఉన్న తాళిబొట్టును పెళ్లి కొడుకు పెళ్లి కూతురు మెళ్లో కట్టేశాడు. ఇరు కుటుంబాల సమక్షంలో యువ జంట వేల అడుగుల ఎత్తులో ఒక్కటైంది. కుటుంబ సభ్యులు కొత్త జంటను ఆశీర్వదించారు. ఈ పెళ్లికి సంబంగించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.