నటుడు విశ్వక్ సేన్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్టు వెల్లడించారు.
జయాపజయాలతో సంబంధం లేకుండా సినిమాల మీద సినిమాలు చేసుకుంటూ ముందుకు దూసుకుపోతున్న నటుడు విశ్వక్ సేన్. తెలుగు సినిమా ఇండస్ట్రీలో రెండు మూడు సంవత్సరాల దాకా డేట్స్ ఖాళీగా లేని బిజీ హీరోల్లో విశ్వక్ సేన్ కూడా ఒకడు. సినిమా సినిమాకి తన ఫ్యాన్ ఫాలోయింగ్ ని పెంచుకుంటూ పోతున్న విశ్వక్ సేన్ తాజాగా తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేసిన ఒక విషయం ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది. విశ్వక్ సేన్ ప్రస్తుతం తన రాబోయే కొత్త సినిమాల షూటింగ్ లలో ఫుల్ బిజీగా ఉన్నాడు. అంత బిజీలో కూడా సోషల్ మీడియా ద్వారా తాను చాలా సంవత్సరాల నుంచి ఆదరిస్తున్న తెలుగు ప్రేక్షకులకు ఎప్పుడు రుణపడి ఉంటానని చెప్పాడు.
అంతే కాకుండా ఇంకో షాకింగ్ న్యూస్ ని కూడా చెప్పాడు. ఆ న్యూస్ విన్న విశ్వక్ సేన్ ఫ్యాన్స్ అందరూ ఫుల్ ఖుషిలో ఉన్నారు. ఇన్నాళ్లు తనను అభిమానించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలుపుతూనే తన లైఫ్ కి సంబంధించిన ఇంకో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించబోతున్నానని.. అందుకు మీ అందరి ఆశీస్సులు కావాలని విశ్వక్ సేన్ కోరాడు. ఇన్ స్టాగ్రామ్ లో విశ్వక్ సేన్ పోస్ట్ చేసిన ఆ మ్యాటర్ ని చూసిన విశ్వక్ సేన్ అభిమానులు, శ్రేయోభిలాషులు.. విశ్వక్ సేన్ అతి త్వరలో పెళ్లిచేసుబోతున్నాడని అంటున్నారు. విశ్వక్ సేన్ పోస్ట్ చేసిన ఆ మాటర్ తో ఇప్పుడు ఇంకో విషయం కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీ లో చక్కర్లు కొడుతుంది.
హైదరాబాద్ కి చెందిన ఒక కన్స్ట్రక్షన్ కంపెనీ అధినేత కూతురు, విశ్వక్ సేన్ లు చాలా కాలం నుంచే ప్రేమించుకుంటున్నారని, ఇప్పుడు ఇద్దరి ప్రేమ విషయం విశ్వక్ సేన్ ఇంట్లో వాళ్ళతో పాటు అమ్మాయి ఇంట్లో కూడా తెలిసిందని అంటున్నారు. దీంతో ఇరువైపుల పెద్దలు కూడా వాళ్ళ పెళ్ళికి అంగీకరించారని, అందుకే విశ్వక్ సేన్ సోషల్ మీడియా లో ఆ విధంగా పోస్ట్ పెట్టాడనే రూమర్ ఒకటి బయట చక్కర్లు కొడుతుంది. తను ప్రారంభించబోయే కొత్త జీవితానికి తెలుగు ప్రజల ఆశీస్సులు కోరిన విశ్వక్ సేన్ తాను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి విషయంలో వస్తున్న రూమర్స్ కి ఎలా స్పందిస్తాడో చూడాలి.