ప్రకృతి విలయం ఎలా ఉంటుందో కరోనా వంటి విపత్తును చూశాం. యావత్తూ భూమండలమంతా అతలాకుతలమైంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని దేశాల్లో విజృంభించిన ఈ వైరస్ అనేక మంది ప్రాణాలను బలితీసుకుంది. ఇటీవల కాలంలో అతిపెద్ద ప్రాణ నష్టం మిగిల్చిన విషాదం అది.
ప్రకృతి విలయం ఎలా ఉంటుందో కరోనా వంటి విపత్తును చూశాం. యావత్తూ భూమండలమంతా అతలాకుతలమైంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని దేశాల్లో విజృంభించిన ఈ వైరస్ అనేక మంది ప్రాణాలను బలితీసుకుంది. ఇటీవల కాలంలో అతిపెద్ద ప్రాణ నష్టం మిగిల్చిన విషాదం అది. అయితే ఇప్పుడు వైరస్ తగ్గుముఖం పట్టడంతో కాస్త ఊపిరి పీల్చుకుంటున్నాం. అయితే ప్రకృతి ప్రకోపానికి ఊహించని ఏదైనా జరగొచ్చు. ఇప్పుడు చూస్తున్న వర్షాలు, వరదలు కూడా అందుకు ఉదాహరణలే. అంతరిక్షం కూడా అలాంటిదే. ఈ సారి సూర్యుని రూపంలో పెను విపత్తు పొంచి ఉన్నట్లు హెచ్చరికలు వస్తున్నాయి. సౌర తుఫాను వచ్చే అవకాశాలున్నట్లు అంతరిక్ష వాతావారణాన్ని ఎప్పటికప్పుడు పరిశీలించే అమెరికాకు చెందిన సంస్థ నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్ (NOAA) హెచ్చరికలు చేస్తుంది.
రాబోయే రోజుల్లో సౌర తుఫాను భూమిని తాకే అవకాశాలున్నాయని చెబుతుంది. ప్లాస్మా, అయస్కాంత క్షేత్రాలతో నిండి ఉండే తంతువులు.. యాదృచ్ఛికంగా సూర్యుని ఉపరితలంపై పెద్ద పేలుళ్లకు కారణమవుతాయి. ఇదే విస్ఫోటనం చెంది.. సౌర తుఫానుగా మారుతుంది. ఆగస్టు 1న సూర్యుడిలో దీని కారణంగా భూమి వైపునకు భారీ కరోనల్ మాస్ ఎజెక్షన్ (CME) మేఘాలు కదలి రాగా, తృటిలో తప్పిపోయింది. అయితే ఇప్పుడు మరో సౌరు తుఫాను పొంచి ఉన్నట్లు NOAA చెబుతుంది. రాబోయే రోజుల్లో సీఎంఈలు భూమిని తాకొచ్చు అని తెలుస్తోంది. ఎం-క్లాస్ (మధ్యస్థ స్థాయి) శ్రేణీలో ఆ తీవ్రత ఉండవచ్చు మరోసారి విస్పోటనం జరిగితే.. ఉపగ్రహాలను దెబ్బతినడంతో పాటు షార్ట్‌వేవ్ రేడియో కమ్యూనికేషన్ వంటివి తీవ్రంగా డ్యామేజ్ అయ్యే అవకాశాలున్నాయి. స్పేస్ వెదర్ ఇచ్చిన నివేదిక ప్రకారం.. ఒకటి లేదా అంతకంటే ఎక్కువ సౌర తుఫానులు ఏర్పడి.. భూమి అయస్కాంత క్షేత్రాన్ని తాకే అవకాశం ఉన్నట్లు చెబుతుంది.
సూర్యునికి ఎదురుగా భూమి వైపున 9 క్రియాశీల సన్‌స్పాట్ ప్రాంతాలు ఉన్నాయి. అంటే సౌర మంటలు ఎప్పుడైనా ఏర్పడే అవకాశాలున్నాయి. ఆ విస్పోటనం ఎక్కువగా ఉంటే.. పెద్ద మొత్తంలో పాస్మా, ఇతర పదార్ధాలు విస్పోటనం చెంది.. అంతరిక్షంలోకి విడుదల అవుతాయి. దీని వల్ల సౌర తుఫాను ఏర్పడుతుంది. అయితే ఈ సోలార్ తుఫాను గతం కన్నా బలంగా ఉండవచ్చునని అంచనా. చిన్న తుఫానులు కొంత తీవ్రమైన నష్టాన్ని చేకూరిస్తే.. ఇవి కమ్యూనికేషన్ వ్యవస్థలను దెబ్బతిస్తాయి. దీని వల్ల భారీ నష్టం చేకూరే అవకాశం ఉంది. ఇది వైర్‌లెస్ కమ్యూనికేషన్‌లు మరియు జీపీఎస్ సేవలకు అంతరాయం కలిగిస్తుంది. దీని వల్ల. విమానయాన సంస్థలు, నేవీ, హామ్ రేడియో కంట్రోలర్లు, డ్రోన్ ఆపరేటర్‌లకు ఇబ్బంది కలిగిస్తుంది. సౌర తుఫాను వల్ల నౌకలు, విమానయాన మార్గాల్లో ప్రయాణం కష్టతరం కావచ్చు. ఇక తక్కువ-ఫ్రీక్వెన్సీ ఛానెల్ ద్వారా అందించే ఏదైనా ముఖ్యమైన సమాచారానికి అంతరాయం కలిగించవచ్చు.