హైదరాబాద్- తెలుగు సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి ఇక లేరు. మంగళవారం సాయంత్రం 4 గంటల 7 నిమిషాల సమయంలో ఆయన తుదిశ్వాస విడిచారు. గత కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సికింద్రాబాద్ లోని కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.
తన పాటలతో తెలుగు సినిమాకి జీవం పోసిన సిరివెన్నెల కలం అప్పుడే ఆగిపోయిందంటే ఎరు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన మృతి పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు ధిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. సిరివెన్నెల ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగా సానుభూతి తెలియజేస్తున్నారు.
ఇక సిరివెన్నెల సీతారామ శాస్త్రి చివరిచూపు కోసం ఆయన భౌతిక కాయాన్ని బుధవారం ఉదయం 7 గంటలకు హైదరాబాద్ ఫిలం నగర్ లోని ఫిల్మ్ ఛాంబర్ లో ఉంచనున్నారు. బుధవారం ఉదయం 7 గంటలకు అభిమానుల సందర్శనార్ధం సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి భౌతిక కాయాన్ని ఫిల్మ్ ఛాంబర్, ఫిలింనగర్ వద్ద ఉంచుతారు.
అనంతరం జూబ్లీహిల్స్ లోని మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరుగుతాయి.. అని ఆయన కుటుంబ సభ్యులు మీడియాకు తెలియజేశారు. బుధవారం ఉదయం పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సిరివెన్నెల బౌతిక ఖాయానికి నివాళులర్పించనున్నారు. సాధారణ ప్రజలు, అభిమానులను సైతం ఆయన భౌతిక ఖాయాన్ని సందర్శించేందుకు అనుమతిస్తారు.