ఫిల్మ్ డెస్క్- పాన్ ఇండియన్ స్టార్, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి తరువాత సినిమాల ఎంపికలో చాలా కేర్ తీసుకుంటున్నాడు. బాహుబలి సినిమా తరువాత ప్రభాస్ కు ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్ ఏర్పడింది. దీంతో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు ప్రకటిస్తూ ఫుల్ బిజీగా మారిపోయాడు. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో అయిదు సినిమాలు ఉన్నాయి. రాధే శ్యామ్, సలార్, ఆదిపురుష్ తోపాటు, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రాజెక్ట్ కే, సందీప్ రెడ్డి దర్శకత్వంలో స్పిరిట్ సినిమా చేస్తున్నాడు ప్రభాస్.
ఇదిగో ఇటువంటి క్రమంలో ప్రభాస్ కు సంబందించిన ఈ అంశం సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఐతే ఇది ప్రభాస్ సినిమాకు సంబందించింది మాత్రం కాదు. అసలు విషయం ఏంటంటే.. ప్రభాస్ హైదరాబాద్ లో మరో కొత్త ఇంటిని కొనుగోలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే హైదరాబాద్ తో పాటు ముబైలో ప్రభాస్ కు విలాసవంతమైన బంగ్లా ఉంది. తాజాగా హైదరాబాద్ లోని నానక్‌రామ్‌గూడ సినీ విలేజ్‌లో విలాసవంతమైన విల్లాను నిర్మించనున్నాడని టాక్.
ఔటర్ రింగ్ రోడ్డుకు దగ్గరలో ప్రభాస్ సుమారు 120 కోట్లతో రెండు ఎకరాలు కొన్నాడని సమాచారం. ఎయిర్‌పోర్ట్ కు దగ్గరగా ఉంటుందనీ, ట్రాఫిక్ పెద్దగా వుండని నానక్ రాంగూడ ప్రాంతాన్ని డార్లింగ్ సెలెక్ట్ చేసుకున్నట్లు ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి. ఆ స్థలంలో ప్రభాస్ 80 కోట్ల రూపాయలతో విలాసవంతమైన గెస్ట్ హౌస్ లేదంటే బంగ్లాను నిర్మించాలనుకుంటున్నాడట. అంటే కొత్త విల్లా కోసం ప్రభాస్ ఏకంగా 200 కోట్ల రూపాయలు వెచ్చించనున్నట్లు సమాచారం.
అన్నట్లు నానక్‌రామ్‌గూడలో అనేక మంది స్టార్‌లతో సహా ఇతర రంగాలకు చెందిన పేరుమోసిన వ్యక్తులు నివసిస్తుంటారు. అంతేకాకుండా షూటింగ్ జరిగే ప్రదేశాలకు నానక్ రాంగూడ దగ్గర్లో ఉంటుంది. అందుకే ప్రభాస్ సైతం ఈ ప్రాంతాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఇదే గనుక నిజం ఐతే.. టాలీవుడ్ లో అత్యంత ఖరీదైన ఇళ్లు ప్రభాస్ దే అవుతుందనే చర్చ ఇండస్ట్రీలో జరుగుతోంది.