‘రోమ్ నగరం మంటల్లో తగులబడుతున్న సమయంలో నీరో చక్రవర్తి ప్రశాంతంగా ఫిడేలు వాయించాడట’అనే సామెత చాలా మందికి తెలుసు. అంటే ఆపద ముంచుకొస్తున్న సమయంలో ఏం పట్టన్నట్లు వ్యవహరించిన వారి పట్ల ఈ నానుడిని వినియోగిస్తుంటారు.
‘రోమ్ నగరం మంటల్లో తగులబడుతున్న సమయంలో నీరో చక్రవర్తి ప్రశాంతంగా ఫిడేలు వాయించాడట’అనే సామెత చాలా మందికి తెలుసు. అంటే ఆపద ముంచుకొస్తున్న సమయంలో ఏం పట్టన్నట్లు వ్యవహరించిన వారి పట్ల ఈ నానుడిని వినియోగిస్తుంటారు. ఇప్పుడు ఇదే జరుగుతుంది తెలంగాణలో. గత కొన్ని రోజుల నుండి వర్షాలు దంచికొడుతున్నాయి. జన జీవనం అస్తవ్యస్థం అయిపోతుంది. హైదరాబాద్‌తో సహా పలు నగరాలన్నీ నీట మునిగాయి. రెడ్ అలర్ట్ ప్రకటించారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని, వర్షాల్లో పిచ్చి పనులు చేయొద్దని అధికారులు ప్రజలకు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. చెరువులు, కుంటలు నీటితో నిండి జలశయాలు తలపిస్తున్నాయి. అయితే కొంత మంది ప్రమాదం పొంచి ఉన్నా కూడా పొంగిపొర్లుతున్న చెరువుల వద్ద చేపలు పడుతూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.
తెలంగాణాలో గత కొన్ని రోజుల నుండి కురుస్తున్న వర్షాలకు హైదరాబాద్ శివారులోని మేడ్చల్ చెరువు అలుగు పొంగి పొర్లుతోంది. దీంతో ఆ చెరువులోని చేపలు సైతం వరద నీటిలో కొట్టుకుపోతున్నాయి. దీంతో ఆసక్తిగా తిలకించేందుకు వచ్చిన స్థానికులు చేపలు పడుతున్నారు. కొందరు వలలు తెచ్చుకుని మరీ వరద నీటిలో చేపలు పడుతుండటం గమనార్హం. వరద నీరు ఉధృతంగా ప్రవహరిస్తున్నా.. ఏ మాత్రం ఖాతరు చేయకుండా.. ఏరులై పారుతున్న ఆ వరద నీటిలోనే నిలబడటం, అక్కడే చేపలను వేటాడటం చేస్తున్నారు. అధికారులు ఎన్ని జాగ్రత్తలు చెప్పినా.. ఇలా ప్రవర్తిస్తుండటం పట్ల మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.