విశాఖపట్నం- రష్మీ గౌతమ్.. ఈ జబర్దస్త్ యాంకర్ మరియు సినిమా నటికి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. రష్మీ అందం, అభినయం, టీవీలో గల గల మాట్లాడే మాటలకు అభిమానులు మైమరిచిపోతారు. మరి టీవీల్లో, సినిమాల్లో మాత్రమే కనిపంచే రష్మి నిజంగా కళ్ల ముందుకు వస్తే.. ఇక ఆమె అభిమానులు ఆగుతారా మరి. ఇదిగో ఇక్కడ అదే జరిగింది. ఓ షాపింగ్ మాల్ ను ప్రారంభించేందుకు వచ్చిన రష్మిను చూసేందుకు జనం ఎగబడ్డారు.
విశాఖ పట్నం జిల్లా నర్సీపట్నంలో ఓ షాపింగ్ మాల్ ప్రారంభించడానికి వచ్చింది రష్మీ గౌతమ్. రష్మీ వస్తున్న విషయం తెలుసుకొని స్థానికులు పెద్ద ఎత్తున అక్కడికి వచ్చారు. దీంతో షాపింగ్ మాల్ దగ్గర భారీగా జనం చేరడంతో ట్రాఫిక్ జామ్ అయ్యింది. రష్మి ఆ జనసందోహంలో కారు దిగేందుకే అరగంట సమయం పట్టిందంటే ఎంత జనం వచ్చారో అర్ధం చేసుకోవచ్చు.
ఇక షాపింగ్ మాల్ ప్రారంభోత్సవం సందర్బంగా మాట్లాడిన రష్మి, కరోనా థర్డ్ వేవ్ రాకుండా అందరూ ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. అన్నట్లు గుంటూరు టాకీస్, నెక్ట్స్ నువ్వే సినిమాల్లో వైవిధ్య పాత్రల్లో నటించిన రష్మీ, ప్రస్థానం, అంతకు మించి, బిందాస్, కరెంట్ తదితర సినిమాల్లో నటించారు. కేవలం తెలుగులోనే కాకుండా కన్నడం, తమిళంతో పాటు ఓ హిందీ సినిమాలోనూ నటిస్తోంది.