ఫిల్మ్ డెస్క్- బాహుబలి.. తెలుగు సినిమా సత్తాను ప్రపంచానికి చాటిన చిత్రం. తెలుగు దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమా భారతీయ సినీసాంకేతికతను మరో లెవల్ కు తీసుకెళ్లింది. ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా, నాజర్, రమ్యకృష్ణ, సత్యరాజ్ అద్భుత నటన, కనీవినీ ఎరుగని గ్రాఫిక్స్, భారీ సెట్టింగ్స్.. ఒక్కటేమిటీ బాహుబలిలో అన్నీ అద్భుతాలే. ఇక బాహుబలి కలెక్షన్స్ లో అన్ని సినిమాలను మించిపోయింది. ఇప్పటికీ ఏ సినిమా బాహుబలి రికార్డ్స్ ను క్రాస్ చేయలేకపోతోంది.
బాహుబలి సినిమాను రాజమౌళి రెండు భాగాలుగా తీశారు. ఐతే ఈ రెండు సినిమాల కంటే ముందు ఏం జరిగిందనేదానేది ఎవ్వరికి తెలియదు. త్వరలోనే ఆ కథకు సంబందించి ఓ వెబ్‌సిరీస్ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రముఖ రచయిత ఆనంద్ నీలకంఠన్ రాసిన ది రైజ్ ఆఫ్ శివగామి అనే నవల ఆధారంగా బాహుబలి వెబ్ సిరీస్ ను తెరకెక్కించనున్నారు. ప్రసాద్ దేవినేని,
రాజమౌళి ఆర్కా మీడియా పతాకంపై ఈ వెబ్ సిరీస్‌ని నిర్మిస్తున్నారని తెలుస్తోంది. దేవాకట్ట, ప్రవీణ్ సత్తారు ఈ వెబ్ సిరీస్ కు దర్శకత్వం వహిస్తున్నట్లు సమాచారం. ఇక్కడ మరో ఆసక్తికరమైన అంశం ఏంటంటే తమిళ లేడీ సూపర్ స్టార్ నయనతార బాహుబలి వెబ్ సిరీస్ లో నటిస్తోందన్న ప్రచారం జరుగుతోంది. నయనతార ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తున్నారట.
ఈ సిరీస్ ద్వారా నయనతార తొలిసారిగా ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లోకి అడుగుపెట్టబోతోంది. అయితే నయనతార బాహుబలి వెబ్ సిరీస్ లో ఏ పాత్రలో నటిస్తోందన్నది మాత్రం క్లారిటీ లేదు. ఇక ప్రముఖ ఓటీటీ నెట్ ఫ్లిక్స్‌లో ఈ వెబ్ సిరీస్ ప్రసారం అవబోతోందట. తెలుగు, తమిళ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో దీన్ని అందుబాటులోకి తీసుకురానున్నారని సమాచారం.
BIG NEWS: #Nayanthara makes her grand OTT entry with the magnanimous project ‘Baahubali before the beginning’ for NETFLIX.
The web series will go on floors by September 2021. pic.twitter.com/0QeWI8c06p
— LetsOTT GLOBAL (@LetsOTT) July 16, 2021