లేడీ సూపర్ స్టార్ గా క్రేజ్ తెచ్చుకున్న నయనతార.. ఒక పక్క హీరోలతో సినిమాలు చేస్తూనే, మరో పక్క లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో దుమ్ము లేపుతుంది. విభిన్నమైన కథలతో, థ్రిల్లర్ మూవీస్ తో ఆకట్టుకుంటున్న నయనతార.. తాజాగా మరో థ్రిల్లర్ సినిమాతో మన ముందుకు వస్తోంది. అశ్విన్ శరవణన్ దర్శకత్వంలో నయనతార, సత్యరాజ్, అనుపమ్ ఖేర్ నటించిన హారర్ థ్రిల్లర్ కనెక్ట్. సినిమా ప్రమోషన్స్ లో చురుగ్గా పాల్గొంటుంది నయనతార. ఈ సందర్భంగా ఆమె సుమతో ముచ్చటించింది. ఇంటర్వ్యూలో భాగంగా ఆమె ప్రభాస్, తారక్ వంటి హీరోలపై ఆసక్తికర కామెంట్స్ చేసింది. ప్రభాస్ తో ఉంటే బాగుంటుంది అని కామెంట్స్ చేసిన నయనతార.. అదే ఇంటర్వ్యూలో తారక్ గురించి కూడా పలు ఆసక్తికర కామెంట్స్ చేసింది.
తారక్ తో కలిసి అదుర్స్ సినిమాలో నటించిన నయనతార.. ఆ సమయంలో జరిగిన సంఘటనలను ఆమె గుర్తు తెచ్చుకుంది. తారక్ చాలా క్యూట్ పర్సన్ అని, ఎన్టీఆర్ అద్భుతమైన డ్యాన్స్ కి తాను ఆశ్చర్యపోయానని ఆమె వెల్లడించింది. డ్యాన్స్ కోసం తనను తాను మలచుకునే తీరు అవుట్ స్టాండింగ్ అని ఆమె కొనియాడింది. కానీ ఎన్టీఆర్ ని ఎప్పుడూ రిహార్సల్స్ లో చూడలేదని ఆమె వెల్లడించింది. ఆల్మోస్ట్ ఇండస్ట్రీలో హీరోలందరూ డ్యాన్స్ రిహార్సల్స్ చేస్తారని.. కానీ సెట్స్ లోకి వచ్చి… అప్పటికప్పుడు స్టెప్స్ ఒకసారి గమనించి.. టేక్ కి సిద్ధమయ్యే హీరో తారక్ మాత్రమే అని ఆమె వెల్లడించింది. రిహార్సల్ లేకుండా డ్యాన్స్ చేస్తామని అందరు హీరోలు చెప్తారు కానీ అందులో నిజం లేదని, రిహార్సల్స్ లేకుండా తారక్ డ్యాన్స్ చేయగలరని ఆమె తెలిపింది.
తన ముందు డ్యాన్స్ మూమెంట్స్ వేసి చూపించే డ్యాన్సర్ల కంటే కూడా అద్భుతంగా ఎన్టీఆర్ డ్యాన్స్ చేస్తారని ఆమె అన్నది. రిహార్సల్ లేకుండా తారక్ డ్యాన్స్ చూసి సెట్ లో అందరం షాక్ అయ్యామని ఆమె వెల్లడించింది. ఇక ఈమె నటించిన కనెక్ట్ సినిమా ట్రైలర్ ఆకట్టుకుంటుంది. అశ్విన్ శరవణన్ దర్శకత్వం వహించగా.. ఆమె భర్త విఘ్నేశ్ శివన్ నిర్మించారు. తమిళంలో తెరకెక్కిన ఈ సినిమా అదే పేరుతో రేపు (డిసెంబర్ 22న) విడుదల కాబోతుంది.మరి ఎన్టీఆర్ డ్యాన్స్ పై నయనతార చేసిన కామెంట్స్ పై మీ అభిప్రాయం ఏంటి? రిహార్సల్స్ లేకుండా ఒకసారి చూసి డ్యాన్స్ చేసే తారక్ టాలీవుడ్ లో ఉండడం నిజంగా మన అదృష్టమే. మరి దీనిపై మీ అభిప్రాయమేంటో కామెంట్ చేయండి.