Youth Runs 350 KM In 50 Hours: ఆర్మీ రిక్రూట్మెంట్ జరగాలని డిమాండ్ చేస్తూ ఓ యువకుడు వినూత్నంగా నిరసన చేపట్టాడు. 50 గంటల్లో 350 కిలోమీటర్లు పరిగెత్తాడు. వివరాల్లోకి వెళితే.. రాజస్తాన్, నాగౌర్ జిల్లాకు చెందిన 24 ఏళ్ల సురేష్ బిచర్కు ఆర్మీ అంటే ప్రాణం. గత రెండేళ్లుగా ఆర్మీ రిక్రూట్ మెంట్ జరగటం లేదు. ఈ నేపథ్యంలో వయసు పెరుగుతోందన్న భయం అతడిలో పట్టుకుంది. అతడితో పాటు ఆర్మీ ప్రాణంగా బ్రతుకుతున్న వారిలోనూ భయం పట్టుకుంది. ఆర్మీ రిక్రూట్మెంట్ జరగాలని డిమాండ్ చేస్తూ ఆర్మీ ఆశావాహులంతా ఢిల్లీలో నిరసన చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో సురేష్ వినూత్నంగా నిరసన తెలియజేస్తూ ఢిల్లీకి చేరుకోవాలనుకున్నాడు. ఇందుకోసం రాజస్తాన్లోని శిఖర్నుంచి న్యూఢిల్లీకి పరుగులు పెట్టుకుంటూ వెళ్లాడు. 50 గంటల్లో 350 కిలోమీటర్లు పరిగెత్తాడు.
దీనిపై అతడు మాట్లాడుతూ.. ‘‘ ఇప్పుడు నా వయసు 24 సంవత్సరాలు. నాది రాజస్తాన్లోని నాగౌర్ జిల్లా. నాకు ఆర్మీ అంటే ప్రాణం. గత రెండేళ్లుగా రిక్రూట్మెంట్ జరగటం లేదు. నాగౌర్, శిఖర్, ఝున్ఝును జిల్లాలకు చెందిన యువత వయసు కూడా మించిపోతోంది. యువతలో ఉత్సహాం నింపటానికే నేను పరిగెత్తుకుంటూ వచ్చాను’’ అని చెప్పాడు. ప్రస్తుతం అతడు పరిగెత్తుతున్న దృశ్యాలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. సురేష్ పరుగుపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : వీడియో: చీరకట్టులో భర్తతో బాస్కెట్ బాల్ ఆడిన సన్నీలియోన్!
#WATCH दिल्ली: भारतीय सेना में शामिल होने के लिए इच्छुक एक युवा राजस्थान के सीकर से दिल्ली में एक प्रदर्शन में शामिल होने के लिए 50 घंटे में 350 किलोमीटर दौड़कर पहुंचा। pic.twitter.com/rpRVH8k4SI
— ANI_HindiNews (@AHindinews) April 5, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.