నిత్యం ఏదో ఒక ప్రాంతంలో మహిళపై అఘాయిత్యాలు జరుగుతున్నే ఉన్నాయి. ఆడపిల్లలు అడుగు బయట పెట్టినది మొదలు తిరిగి ఇంటికి వచ్చే వరకు భయం భయంగా ఉంటారు. తాజాగా ఓ ర్యాపిడో బైకర్ యువతి పట్ల వికృతంగా ప్రవర్తించా[g. ఆ నీచుడి కారణంగా యువతి ఆస్పత్రి పాలైంది.
నిత్యం ఏదో ఒక ప్రాంతంలో మహిళపై అఘాయిత్యాలు జరుగుతున్నే ఉన్నాయి. ఆడపిల్లలు అడుగు బయట పెట్టినది మొదలు తిరిగి ఇంటికి వచ్చే వరకు భయం భయంగా ఉంటారు. ఇంకా దారుణం ఏమిటంటే ప్రయాణం కోసం ఉపయోగించే ర్యాపిడో వాహనాల్లో కూడా సేఫ్ లేకుండా పోతుంది. తాజాగా ఓ యువతి పట్ల ర్యాపిడో బైకర్ వికృతంగా ప్రవర్తించాడు. భయంతో బైక్ పై నుంచి దూకేసిన ఆమె ఆస్పత్రి పాలైంది. ఈ ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. ఈ ఘటనతో ర్యాపిడో బైక్స్ ఎక్కాలంటే యువతులు భయ పడుతున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
కర్నాటక రాష్ట్రంలోని బెంగళూరులో ఉంటున్న 30 ఏళ్ల యువతి ఓ ప్రైవేటు కంపెనీలో ఆర్కిటెక్ట్ గా పని చేస్తోంది. ఈ నెల 21న రాత్రి 11.30 గంటల సమయంలో ఇందిరానగర్ వెళ్లేందుకు ర్యాపిడో బైక్‌ను యాప్‌లో బుక్ చేసింది. ఈ క్రమంలో యువతిని పికప్ చేసుకున్న బైకర్ ఆమె మొబైల్‌ను లాక్కున్నాడు. అనంతరం బైక్ స్పీడ్ పెంచి ఆమె పట్ల వికృతంగా ప్రవర్తించడం ప్రారంభించాడు. అంతేకాక ఆ యువతిని కౌగిలించుకుని వెకిలిచేష్టలు చేశాడు. ఆమె వెళ్లాల్సిన మార్గంలో కాకుండా మరో మార్గంలో తీసుకెళ్తుండగా యువతి అతడిని ప్రశ్నించింది. అయితే అతడు సమాధానం ఇవ్వకుండా బైక్ ను మరింత వేగంగా పోనిచ్చాడు.
అతడు మద్యం మత్తులో ఉన్నట్లు యువతి గమనించింది. భయాందోళనకు గురైన ఆమె ఒక స్నేహితురాలికి, అలాగే పోలీసులకు కాల్ చేసి సాయం అడిగింది. అనంతరం బీఎంఎస్ ఇన్‌స్టిట్యూట్ వద్దకు రాగానే నుంచి బైక్ పై నుంచి యువతి దూకడంతో గాయపడింది. ప్రస్తుతం ఆ యువతి ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం ఆమె ఇచ్చిన ఆధారాల ద్వారా నిందితుడైన ర్యాపిడో బైకర్‌ను అరెస్ట్ చేశారు.
అతనిపై కిడ్నాప్, వేధింపులు, లైంగిక దాడికి, హత్యయత్నం తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ పరిణామంతో అందరిలో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటి వరకు సేఫ్ అనుకునే ర్యాపిడో బైక్ వంటి వాటిపై ఈ ఘటనతో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. యువతులకు, మహిళకు ఇవి సేఫ్ కాదా? అనే సందేహం కూడా కొందరు వ్యక్తం చేస్తున్నారు. మరి.. ఈ ర్యాపిడో బైక్ వంటి వాహనాలు యువతులకి సురక్షితమైనా? కాదా ?. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.