ప్రయాణం అంటేనే వ్యయ ప్రయాసలతో కూడుకున్నది. వ్యయం అయితే పెట్టొచ్చు కానీ.. ప్రయాణం చేయాలంటే శారీరకంగా సంసిద్ధత ఉండాలి. కొంచెం ప్రయాణం చేస్తేనే అలసట ఏర్పడుతుంది. ఇక ఫ్యామిలీతో కలిసి టూర్ వేయాలంటే ఒళ్లు హునం అయినట్లే
ప్రయాణం అంటేనే వ్యయ ప్రయాసలతో కూడుకున్నది. వ్యయం అయితే పెట్టొచ్చు కానీ.. ప్రయాణం చేయాలంటే శారీరకంగా సంసిద్ధత ఉండాలి. కొంచెం ప్రయాణం చేస్తేనే అలసట ఏర్పడుతుంది. ఇక ఫ్యామిలీతో కలిసి టూర్ వేయాలంటే ఒళ్లు హునం అయినట్లే. రొటీన్ లైఫ్ నుండి కాస్త భిన్నంగా ఎటైనా వెళ్లాలంటే.. రైలు, బస్సులను ఆశ్రయించాల్సిందే. ముఖ్యంగా రైళ్లల్లో ప్రయాణించాలంటే ముందు నుండే రిజర్వేషన్ తప్పనిసరి. అదే అప్పటికప్పుడు ప్రయాణం చేస్తే.. జనరల్ కోచ్ లో ఎక్కి.. ఒళ్లు అప్పచ్చి చేసుకోవాల్సిందే. అయితే ఇటీవల వచ్చిన వందే భారత్ ఎక్స్ ప్రెస్ ప్రయాణ సమయాన్ని తగ్గించడంతో ప్రయాణీకులకు కాస్త ఊరట కలిగించింది. ఈ రైళ్లల్లో వ్యయం ఎక్కువ అయినా, సుఖవంతమైన ప్రయాణాన్ని ఆస్వాదిస్తున్నారు ప్రయాణీకులు.
దక్షిణ మధ్య రైల్వేకు సంబంధించిన ఇప్పటికే తెలుగు రాష్ట్రాల మధ్య సికింద్రాబాద్-విశాఖపట్నం, సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు పరుగులు పెడుతున్నాయి. దేశ వ్యాప్తంగా వందేభారత్ రైళ్లకు డిమాండ్ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది. ఇప్పటి వరకు వందే భారత్‌లో చైర్ కారు మాత్రమే అందుబాటులో ఉండగా.. స్లీపర్ రైళ్లను ప్రవేశ పెట్టాలని యోచిస్తుంది. ఈ మేరకు ప్రకటించారు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్. మార్చి 2024 నాటికి వందేభారత్ స్లీపర్ సర్వీసులు ప్రారంభమవుతాయని ఆయన తెలిపారు. దీనికి సంబంధించిన డిజైన్లు చెన్నైలోని ఇంటెగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో రూపొందిస్తున్నారు.
ఈ ఏడాది చివరి నాటికల్లా డిజైన్లను ఖరారు చేసి.. రైలు కోచ్‌లను తయారు చేసి ప్రారంభించాలని రైల్వే శాఖ నిర్ణయించింది. వందేభారత్ రైళ్లల్లో మూడు రకాలు ఉన్నాయని.. అవి వందే మెట్రో, వందే చైర్ కార్, వందే స్లీపర్ అని కేంద్ర రైల్వేశాఖ తెలిపింది. 2024 మార్చి నాటికి పలు వందే భారత్ స్లీపర్ రైళ్లను పట్టాలెక్కించేలా చర్యలు తీసుకుంటోంది. సుదూర ప్రాంతాల మధ్య రాత్రి, పగలు హాయిగా ప్రయాణం సాగించేందుకు సదుపాయాలను అందుబాటులోకి తేవాలని నిర్ణయించింది. ఇదిలా ఉండగా.. ఇవన్నీ కూడా వచ్చే ఫిబ్రవరి-మార్చి నాటికి ప్రయాణీకులకు అందుబాటులోకి తీసుకురానుంది.