టెక్నాలజీ పెరిగిపోతుంది.. దానితో పాటు రవాణా వ్యవస్థ కూడా భారీగా పెరిగుతుంది. ఈ క్రమంలో వాతావరణం పూర్తిగా కలుషితం అవుతుంది. ప్రాణవాయువు అనేది లేకుండా పోయే ప్రమాదం ఉందని పర్యావరణ శాస్త్రవేత్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాహనాల నుంచి వచ్చే పొగ వల్ల వాతావరణం కలుషితం అవుతుంది.. ప్రజలు స్వచ్ఛమైన గాలిని పీల్చుకునే పరిస్థితి చేజారిపోతుందని హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో ఇందన రహిత వాహనాలపై దృష్టిసారిస్తున్నారు. ఇప్పటికే ఎలక్ట్రిక్ వాహనాలు వస్తున్న విషయం తెలిసిందే.
ఈ క్రమంలో దేశంలో తొలిసారిగా పర్యావరణ అనుకూలమైన గ్రీన్ హైడ్రోజన్ ఆధారిత వాహనంలో కేంద్ర రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ ప్రయాణించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భవిష్యత్ లో ఈ వాహనాదే హవా కొనసాగుతుందని అన్నారు. ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ ప్రజలపై ఎంత భారం పడుతుందో అందరికీ తెలిసిందే.. దాంతో పాటు వాతావరణం కూడా కలుషితం అవుతుంది. హైడ్రో ఇంధన సెల్ కార్లతో కాలుష్యం ఉండదని ఆయన వివరించారు. ప్రధాని నరేంద్ర మోదీ సైతం భారత్ స్వయం సమృద్ధి సాధించే దిశగా ఈ తరహా వాహనాలు భారీ ముందడుగుగా అభివర్ణించారు.
ఇదిలా ఉంటే దేశ తొలి హైడ్రోజన్ ఆధారిత ఆధునిక ఫ్యూయల్ సెల్ ఎలక్ట్రిక్ వాహనం టయోటా మిరైను మంత్రి గడ్కరీ ఆవిష్కరించారు. అంతేకాదు ఇక నుంచి హైడ్రోజన్ పవర్డ్ కారును ఉపయోగిస్తానని అన్నారు. దేశంలో ఇందన ఖర్చు బాగా పెరిగిపోతున్న నేపథ్యంలో గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తికి పెద్ద ఎత్తున ప్రోత్సాహకాలు ఇవ్వాని కేంద్ర సర్కారు ఇప్పటికే నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
Green Hydrogen ~ An efficient, ecofriendly and sustainable energy pathway to make India ‘Energy Self-reliant’ pic.twitter.com/wGRI9yy0oE
— Nitin Gadkari (@nitin_gadkari) March 16, 2022