ఏదైన వస్తువులు,సర్వీస్ విషయంలో వినియోగదారులకు అన్యాయం జరిగితే వినియోగదారుల ఫోరంకి వెళ్తారు. అయితే వినియోదారుడు ఇచ్చిన ఫిర్యాదును పరిశీలించి..వారికి తగిన న్యాయం చేస్తారు. అలా ఇప్పటికే వినియోదారుల ఫోరంలు అనేక సంచలన తీర్పు ఇచ్చాయి. తాజాగా ముంబైకి చెందిన ఓ వినియోదారుల ఫోరం ఓ క్యాబ్ సంస్థకు రూ.20 వేల జరిమాన విధించింది. క్యాబ్ బుక్ చేసుకున్న వ్యక్తికి సమయం వృథా చేస్తూ ఆలస్యంగా వచ్చినందు కోర్టు ఈ తీర్పు ఇచ్చింది. 2018లో జరిగిన ఈఘటనపై విచారణలు జరుతూ.. తాజాగా వినియోదారుడికి అనుకూలంగా తీర్పు వచ్చింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే..
మహారాష్ట్రలోని ముంబైయికి చెందిన కవితా శర్మ అనే మహిళ న్యాయవాదిగా పనిచేస్తుంది. అయితే ఆమె 2018 జూన్ 12న చెన్నై వెళ్లాడానికి ముంబైలో విమానం ఎక్కాల్సి ఉంది. విమానాశ్రయానికి ఆమె ఇంటికి 36 కి.మీ దూరం ఉంది. అయితే వేరే వాహనాల్లో వెళ్తే ఆలస్యం అవుతుందనే కారణంతో తన ఇంటి నుంచి ఓ క్యాబ్ ను బుక్ చేసుకుంది. కవితా శర్శ మధ్యాహ్నం 3.29 గంటలకు క్యాబ్ బుక్ చేయగా యాప్ లో చూపించిన సమయం కంటే 14 నిమిషాలు ఆలస్యంగా క్యాబ్ వచ్చింది. అంతేకాక ఆ క్యాబ్ వచ్చేలోపు కూడా సదరు డ్రైవర్ కి పలుమార్లు ఫోన్ కాల్ చేయల్సి వచ్చిందట. తనకు జరిగిన నష్టం గురించి కోర్టుకు పూర్తి సమాచారంతో ఆమె ఫిర్యాదు చేసింది. క్యాబ్ డ్రైవర్ కి పలుమార్లు ఫోన్ చేసినట్లు, పైగా అతడు ఫోన్ మాట్లాడుతూ.. జర్నీని మరింత ఆలస్యంగా ప్రారంభించాడని ఫిర్యాదులో పేర్కొన్నారు.
అంతే కాక వేరే మార్గంలో వెళ్లి కొంత సమయం, సీఎన్జీ స్టేషన్ లో ఆపి మరికొంత సమయం వేస్ట్ చేశాడని ఆమె తెలిపారు. దీంతో మొత్తంగా తనకు దాదాపు 20 నిమిషాల సమయం ఆలస్యం కావడంతో …తాను ఎక్కాల్సిన విమానం అప్పటికే విమానం వెళ్లిపోయినట్లు ఆమె తెలిపారు. దీంతో చేసేది లేక మరో టికెట్ కొనుక్కొని తర్వాతి విమానానికి వెళ్లాల్సి వచ్చిందన్నారు. అంతేకాక ఫిర్యాదులో కవిత శర్మా మరో అంశం వెల్లడించారు. యాప్ లో బుక్ చేసుకున్న సమయంలో రైడ్ ఖరీదు రూ.563 చూపించగా.. ఎయిపోర్టు చేరుకునే సరికి ఊబర్ రూ.703 బిల్లు చేసినట్లు తెలిపారు. అయితే ఈ విషయంపై వారికి ఫిర్యాదు చేయగా అదనంగా తీసుకున్న సొమ్మును తిరిగి ఇచ్చేశారు. క్యాబ్ డ్రైవర్ చేసిన ఆలస్యంగా కారణంగా తనకు జరిగిన నష్టంపై ఉబర్ కంపెనీకి లీగల్ నోటీసులు పంపారు.
కానీ వారి నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో ఆమె.. ఠాణె జిల్లా వినియోదారుల ఫోరంను ఆశ్రయించింది. ఈ క్రమంలో కోర్టులో విచారణ కొనసాగింది. తాము కేవలం వినియోదారులకు , డ్రైవర్లకు మధ్య అనుసంధానం చేసే వేదిక మాత్రమేనని ఉబర్ సంస్థ ఫోరంకి వివరణ ఇచ్చింది. అయితే ఇద్దరి మధ్య సంధానకర్తగా ఉన్న నేపథ్యంలో లావాదేవీలుస సేవలకు కూడా బాధ్యత వహించాల్సిందేనని వినియోదారుల ఫోరం స్పష్టం చేసింది. ఈ క్రమంలో కీలక తీర్పు వెల్లడించింది. కోర్టు ఖర్చుల కింద రూ.10 వేలు, ఆమె మానసికంగా వేదనకు గురిచేసినందుకు గానుూ మరో రూ.10 వేలు చెల్లించాల్సిందేనని ఫోరం ఆదేశించింది. ఈ తీర్పుపై సదరు మహిళ ఆనందం వ్యక్తం చేసింది.