ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు అంటే దొచుకుని దాచుకునే వారని చాలా మంది అభిప్రాయ పడుతుంటారు. అవేమి పట్టించుకోకుండా కొందరు నిస్వార్థంగా ప్రజలకు సేవ చేస్తుంటారు. కొన్ని సార్లు ప్రజా ప్రతినిధులు భావోద్యేగానికి గురై కన్నీరు పెట్టిన సందర్భాలు అనేకం ఉన్నాయి. తాజాగా టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఓ సమావేశంలో మాట్లాడుతూ భావోద్వేగానికి గురై కంటతడి పెట్టుకున్నారు. మరి.. ఆ ఎమ్మెల్యే ఎవరు? కంటతడి పెట్టుకోవడానికి గల కారణం ఏమిటో ఇప్పుడు చూద్దాం..
టీఆర్ఎస్ పార్టీ పాలేరు నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి పాల్గొన్నారు . శుక్రవారం టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు బి.వీరన్న అధ్యక్షతన దమ్మాయిగూడెం గ్రామంలో ఓ ఫంక్షన్ హాల్లో ఈ విస్తృతస్థాయి సమావేశాని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డి మాట్లాడుతూ.. “నా వ్యక్తిత్వంలో ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఆపదలో ఉన్నవారిని చూసి జాలి పడతానని.. అందరికీ మంచి చేయాలని అనుకుంటానాను. అంతే తప్ప ఎదుటివారిని నొప్పించే మనస్తత్వం నాది కాదు. ఎవరికి ఏ కష్టం వచ్చినా సరే నాదే అనుకుంటాను.ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడానికి కుల, మత, ప్రాంత భేదాలు నాకు లేవు. రేయింబవళ్లు తేడా లేకుండా పనిచేస్తాను. కార్యకర్తలు ఏ సమయంలో వచ్చిన కలుస్తాను. నా మనస్తత్వం ఏంటో మీకు తెలుసు”అని ప్రజలను ఉద్దేశించి ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డి అన్నారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే భావోద్వేగానికి గురై కన్నీరు పెట్టుకున్నారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలు సహకరించాలని ఎమ్మెల్యే కోరుకున్నారు. మరి.. ఎమ్మెల్యే భావోద్వేగంతో కంటతడి పెట్టుకోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.