ఈ మధ్య కాలంలో విమాన ప్రమాదాలు అనేక చోటుచేసుకుంటున్నాయి. ఈ ప్రమాదాల్లో అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. మరికొందరు తీవ్రగాయాలతో జీవితాంత ఇబ్బందులు పడుతున్నారు. అదే విధంగా శిక్షణలో ఉండే పైలట్లు సైతం అప్పుడప్పుడు ప్రమాలకు గురై ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా సింగిల్ సీటర్ విమానం మహారాష్ట్రలోని పూణె జిల్లాలో కుప్పకూలింది. సోమవారం ఉదయం 11.30 గంటల సమయంలో జరిగిన ఈ ఘటనలో పైలట్ శిక్షణలో ఉన్న భావనా రాఠోడ్ (22) గాయాలయ్యాయి. స్వల్ప గాయాలతో ఆమె ప్రమాదం నుంచి బయటపడింది. ఎవరూ లేని మైదాన ప్రాంతంలో ఫ్లైట్ కూలడంతో ఎవరికి ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు.
అయితే ఈ ఫ్లైట్ ఓ ప్రైవేటు ఏవియేషన్ శిక్షణ సంస్థది. భావనా రాఠోడ్ విమానంలో ఒంటరిగా పూణెలోని బారామతి విమానాశ్రయంలో బయలుదేరింది. ఫ్లైట్ గాల్లోకి ఎగిరిన కొంత సమయం తరువాత సాకేంతిక లోపం కారణంగా ఇందాపూర్ తహసీల్‌లోని కడ్బన్‌వాడి ప్రాంతంలో పెద్ద శబ్ధంతో కూలింది. ఆ భారీ శబ్ధం విని స్థానికులకు సంఘటన స్థలానికి పరుగులు తీశారు. ప్రమాదంలో గాయపడిన ఆ భావనా రాఠోడ్‌కి వెంటనే ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం నవ్‌జీవన్ ఆస్పత్రికి తరలించారు. ఈ దుర్ఘటనలో ఫ్లైట్ పూర్తిగా దెబ్బతిన్నది. అలాగే సాంకేతిక లోపం కారణంగా ఫ్లైట్‌కి విద్యుత్ సరఫరా నిలిచిపోయి.. ఈ ప్రమాదం జరిగినట్టు అధికారులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చింది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
#WATCH | Maharashtra: A trainee aircraft crashed in a farm in Kadbanwadi village of Indapur taluka in Pune district today around 11.30am. 22-yr-old trainee pilot, Bhavika Rathod injured. Aircraft belongs to Carver Aviation, Baramati. Its staff present at spot. Investigation is on pic.twitter.com/Z895LQAXn2
— ANI (@ANI) July 25, 2022