ప్రమాదాలు రోడ్డు, రైలు మార్గాల్లోనే కాదు.. గాలిలో కూడా జరుగుతూనే ఉంటాయి. తాజాగా జరిగిన ఓ ప్రమాదం వల్ల పైలట్ ప్రాణాలు కోల్పోయాడు. ట్రైనీ పైలట్ తీవ్ర గాయాలతో ఆస్పత్రి పాలయ్యాడు. ట్రైనీ ఎయిర్ క్రాఫ్ట్ ఓ గుడి గోపురాన్ని ఢీకొని ఈ ప్రమాదం సంభవిచింది. ఎయిర్ క్రాఫ్ట్ ధ్వంసం కాగా.. ట్రైనీ పైలట్ మాత్రమే ప్రాణాలతో బయట పడ్డాడు. వైద్యులు అతనికి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించిన చిత్రాలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
మధ్యప్రదేశ్ రాష్ట్రం రేవా జిల్లాలో ఈ విమాన ప్రమాదం సంభవించింది. గురువారం అర్ధరాత్రి ఓ శిక్షణ విమానం గుడి గోపురాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పాట్నాకు చెందిన ట్రైనర్ కెప్టెన్ విమల్ కుమార్ చికిత్స పొందుతూ మృత్యువాత పడ్డాడు. ప్రమాదంలో గాయాలపాలైన జైపూర్ కు చెందిన సోనూ యాదవ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే ఈ ప్రాదానికి సంబంధించి స్పష్టమైన కారణాలు తెలియరాలేదు. పొగ మంచు కారణంగా విమానం గుడి గోపురాన్ని ఢీకొట్టినట్లు చెబుతున్నారు.
#MadhyaPradesh : Trainer aircraft crashes after colliding with dome of a temple, pilot killed in #Rewa pic.twitter.com/ftIjzVwh6k
— TOI Bhopal (@TOIBhopalNews) January 6, 2023
ప్రమాదానికి గురైన ట్రైనీ ఎయిర్ క్రాఫ్ట్ ఫాల్కన్ ఏవియేషన్ అకాడమీకి చెందిందిగా తెలుస్తోంది. ఘటనాస్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యప్తు ప్రారంభించారు. దృశ్యాల్లో చూపిస్తున్న గుడి, గోపురం చాలా తక్కువ ఎత్తులో ఉన్నాయి. విమానాన్ని మరీ అంత కిందకు తీసుకొచ్చారా? అనే అనుమానాలు ఉన్నాయి. గుడి గోపురాన్ని ఢీకొట్టిన తర్వాత చెట్టును కూడా ఢీకొట్టినట్లుతెలుస్తోంది. ఇది టేకాఫ్ అయిన రన్ వేకి 3 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రమాదం జరిగింది. మరి.. పైలట్ అంత కిందకు ఎందుకు విమానాన్ని తీసుకొచ్చారు అనేది తెలియాల్సి ఉంది.
#MadhyaPradesh | Trainee aircraft crashes into the dome of temple in #Rewa, pilot dead.#RewaPlaneCrash
📡 Catch the day’s latest news ➠ https://t.co/d3gioHuLim pic.twitter.com/2AKf9UEzZl
— Economic Times (@EconomicTimes) January 6, 2023