నేటికాలం చాలా మందిలో సహనం అనేది కొరవడుతుంది. అందుకే ప్రతి చిన్న విషయానికి, అలానే చిన్నపాటి ఆలస్యనికి అసహనం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యం థియేటర్లు, రెస్టారెంట్లు, బస్సులు వంటి వాట్లిలో కొద్ది పాటి ఆలస్యం జరిగిన కొందరు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు ఎదుటి వారిపై దాటి చేయడం, వస్తువులన పగల కొట్టడం వంటివి చేస్తుంటారు. ఇలా వారి కోపమే.. వారికి నష్టం చేరుకూస్తుంది. అంతేకాక మరికొన్ని సందర్భాల్లో జైలు పాలు కూడా చేస్తుంది. తాజాగా విమానం ఆలస్యం అయిందని అసహనానికి గురైన ఓ ప్రయాణికుడు ఓ ట్వీట్ చేశాడు. దీంతో అప్రమత్తమైన ఎయిపోర్టు అధికారులు విచారణ చేపట్టారు. చివరకు అసలు విషయం తెలుసుకుని ఆ వ్యక్తిని జైలుకి పంపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
రాజస్థాన్ కు చెందిన మోతీ సింగ్ రాథోడ్ అనే వ్యక్తి దుబాయి నుంచి జైపుర్ కు విమానంలో వస్తున్నాడు. ఈక్రమంలో విమానం జైపూర్ ప్రాంతానికి చేరుకునే సరికి.. అక్కడ వాతావరణం అనుకూలించలేదు. జైపుర్ లో వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో ఆ విమానాన్ని ఢిల్లీకి మళ్లించారు. ఢిల్లీకి 9.45కు చేరుకున్న విమానం తిరిగి 1.40కి జైపుర్ కు బయలుదేరింది. ఈ కాస్త సమయంలో మోతీసింగ్ తీవ్ర అసహనానికి గురయ్యాడు. ఎయిర్ ఫోర్ట్ వారిని కంగారు పెట్టించాలని భావించిన మోతీ సింగ్ ‘విమానం హైజాక్’ అంటూ ఓ ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్ కాస్తా ఎయిపోర్టు అధికారులకు చేరడంతో అప్రమత్తమైనారు. ఈ ట్వీట్ పై విచారణ చేపట్టిన అధికారులకు అసలు విషయం తెలిసింది. దీంతో అతడిని లగేజితో సహా కిందకి దించేసి.. స్థానిక పోలీసులకు అప్పగించారు. ఆ యువకుడు చూపిన అసహనం.. చివరకు జైలు పాలు చేసింది. మరి.. ప్రతి చిన్నదానికి కోపం ప్రదర్శించి.. ఇలా జైలు పాలు కావడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.