సాధారణంగా భక్తులు దేవుళ్లను ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. ఇక పూలు, పండ్లను, ఇతర నైవేద్యాలను దేవుడికి సమర్పిస్తారు. అలానే కొబ్బరికాయ కొట్టి, అంగరబత్తీలను వెలిగించి, పూలతో దేవుడిని అలకరించి పూజలు చేస్తుంటారు. అయితే కొన్ని ప్రాంతాల్లో దేవుళ్లకు భక్తులు చేసే పూజాలు చాలా వింతగా ఉంటాయి. అలానే దేవుడికి భక్తులు సమర్పించే కానుకలు, నైవేద్యాలు చాలా వెరైటీగా ఉంటాయి. తాజాగా ఓ ప్రాంతంలోని దేవుడికి కూడా భక్తులు వింత కానుకలు సమర్పించారు. సాధారణంగా అన్ని చోట్ల దేవుడికి డబ్బులను కానుకలుగా సమర్పిస్తే.. ఇక్కడ మాత్రం గడియారాలను ఇస్తారు. అంతేకాక అగరబత్తీలతో మనం దీపం వెలిగించి దేవుడికి నమష్కారాలు చేసుకుంటే.. ఈ ప్రాంతంలోని భక్తులు మాత్రం సిగరేట్ వెలిగించి దేవుడిని కోర్కెలు కోరుకుంటారు. ఈ విచిత్రమైన ఆచారం మధ్యప్రదేశ్ లోని ఓ ప్రాంతంలో ఉంది. మరీ గడియారాలనే కానుకలుగా దేవుడికి ఇవ్వడం వెనుక ఉన్న రహస్యం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
మధ్యప్రదేశ్ రాష్ట్రం ఉజ్జయిని జిల్లా కేంద్రానికి 45 కి.మీ దూరంలో అన్హెల్ రోడ్డు పక్కన సాగస్ మహారాజ్ ఘడి వాలే బాబా ఆలయం ఉంది. ఈ బాబా ఓ పెద్ద మర్రి చెట్టు కింద కొలువై ఉన్నారు. స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున సాగస్ మహారాజ్ ను సందర్శించుకుని భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తుంటారు. ఇక్కడ విచిత్రం ఏమిటంటే.. ఈ ఆలయానికి ప్రత్యేకంగా పూజారుల అంటూ ఎవరూ ఉండరు. భక్తులే పూజారులుగా మారి.. సొంతంగా పూజలు చేస్తుంటారు. వీరి పూర్వికులు తమ కొర్కెలు తీరితే తమ విలువైన గడియాన్ని సమర్పిస్తామని మొక్కుకున్నారంట. అలా కొర్కెలు తీరడంతో గడియారాన్ని సాగస్ మహారాజ్ కి కానుకగా ఇచ్చారు.
ఇక అప్పటి నుంచి ఇదే ఆచారాన్ని వారి వారసులు కొనసాగిస్తూ వస్తున్నారు. ఈ గుడికి వచ్చే భక్తులు… మొదట తమ కోర్కొలను బాబాకు విన్నవించుకుంటారు. తాము కోరుకున్న కోరికలు తీరిన అనంతరం.. భక్తులు ఈ గుడికి వచ్చి గడియారాలను వాలే బాబాకు సమర్పిస్తారు. అలా అక్కడి రావి చెట్టు మొత్తం గోడ గడియారాలతో నిండిపోయింది. ప్రస్తుతం ఈ చెట్టుకు దాదాపు 2 వేల గడియారాలు వేలాడదీసి ఉన్నాయి. అంతేకాక దేవుడి ముందు సిగరెట్ వెలిగించి మరీ కోరికలు కోరుకుంటున్నారు. మరి.. ఇక్కడ గుడిలో ఉన్న చేస్తున్న భక్తుల వింత ఆచారలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.