మన పూర్వీకులు పశువులను ఇంటి సభ్యుల్లో ఒకరిగా భావించేవారు. అంతేకాక తాము నివాసం ఉంటున్న ఇంట్లోనే గోవులను సైతం కట్టేసుకునే వారు. వాటికి కావాల్సిన ఆహారపదార్ధలు అందిస్తూ సొంత బిడ్డలతో సమానంగా చూసుకునే వారు. అంతేకాక కొన్ని పెళ్లిళ్లలో ఈ గోవులు సందడి చేసేవి. అయితే కాలం మారింది.. మనుషులు చాలా వరకు మారిపోయారు. నేటికాలంలో గోవుల పట్ల నిర్లక్ష్య ధోరణి బాగా పెరిగిపోయింది. వాటి ఆలనపాలన చూసే వారు తగ్గిపోతున్నారు. ఇలాంటి సమయంలో గోవుల పట్ల పెరుగుతున్న నిర్లక్ష్యాన్ని దృష్టిలో ఉంచుకుని, మన పూర్వపు ఆచారాలను మరోసారిగా గుర్తుచేయాలనే ఉద్దేశంతో ఓ యువ జంట వినుత్న కార్యక్రమం చేసింది. గోమాత సమక్షంలో తమ పెళ్లిని చేసుకుంది ఆ యువజంట. మరి… ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..
మధ్యప్రదేశ్ గ్యాలియర్ లోని డీఆర్పీ లైన్ నివాసం ఉంటున్న రంజన శర్మ అనే యువతికి , ఆగ్రాకు చెందిన యతేంద్ర శర్మతో పెళ్లి నిశ్చయమైంది. అయితే రంజనకు మూగజీవాలంటే చాలా ఇష్టం. ముఖ్యంగా గోవులు అంటే ఆమెకు చిన్నతనం నుంచి ఇష్టం. అంతేకాక నేటికాలంలో గోవుల పట్ల పెరుగుతున్న నిర్లక్ష్య ధోరణి ఆమెను బాగా కలచివేసింది. ఈక్రమంలో సనాతన ఆచారాలను ప్రజలకు గుర్తు చేయాలనే ఉద్దేశంతో తనపెళ్లి గోమాత సమక్షంలో జరుపుకోవాలని భావించింది. ఇదే విషయాన్ని తన తల్లిదండ్రులకు తెలిపింది రంజన. మొదట ఒప్పుకునేందుకు కాస్తా ఆలోచించిన రంజన తల్లిదండ్రులు చివరకు అంగీకరించారు.
తమ కుమార్తె చెప్పిన విషయాన్ని వరుడి కుటుంబ సభ్యులకు వివరించారు. వారు కూడా గోమాత సమక్షంలో వివాహం జరిపించేందుకు సంతోషంగా అంగీకరించారు. ఈ క్రమంలో పెళ్లి రోజున మొదట సాధువుల సమక్షంలో వధూవరులు ఓ గోవుకు ప్రత్యేక పూజాలు నిర్వహించారు. ఆ తరువాత దాని సమక్షంలోనే వేదమంత్రాల సాక్షిగా ఆ యువజంట వివాహం జరిగింది. గోవుల ప్రాముఖ్యతను తెలుపుతూ ఈ నూతన జంట చేసిన పనికి అందరూ అభినందించారు. అంతేకాక ఈ వార్త సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది. నెటిజన్లు సైతం ఈ నవ వధువరులపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మరి.. ఈ యువజంట చేసిన పనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.