నేటికాలంలో మానవత్వం కనుమరుగై పోతోందని చాలా మంది ఆవేదన వ్యక్తం చేస్తుంటారు. అలానే కులాలు, మతాల పేరుతో మనిషిని మనిషిగా గుర్తించడం మానేశారని ఆవేదన చెందుతున్నారు. కానీ మానవత్వం బతికే ఉందని, మతాలు వేరైన మనుషులందరం ఒక్కటేని చాటి చెప్పేలా కొందరు ప్రవర్తింస్తుంటారు. ముఖ్యం మతసామరస్యం వెల్లువిరిసే ఘటనలు అనేకం చోటుచేసుకున్నాయి. ముస్లిం సోదరులు, హిందూవుల పండగల్లో పాల్గొనడం, ముస్లింల వేడుకల్లో హిందూవులు సాయం చేయడం వంటి ఘటనలు అనేకం చూశాం. ఇటీవల హిందూ దేవాలయానికి ఓ ముస్లిం వ్యక్తి స్థలాన్ని ఇచ్చారు. అలానే ముస్లిం యువతికి పెళ్లికి హిందువులు ఆర్థిక సాయం చేశారు. తాజాగా మతసామరస్య వెల్లువిరిసేలా ఓ ఘటన జరిగింది. చనిపోయి హిందూ వృద్ధురాలికి.. ముస్లిం యువత అంత్యక్రియలు నిర్వహించింది. ఈ ఘటన మధ్యప్రదేశ్ లో జరిగింది.
మధ్యప్రదేశ్ లోని గ్యాలియర్ పట్టణంలోని రైల్వేకాలనీ దర్గా ప్రాంతంలో రామ్ దేహి మహోర్(90) అనే వృద్దురాలు నివాసం ఉంటుంది. ఆమెకి ఉన్న ఒక్క కూతురు కూడా పెళ్లి చేసుకుని ఢిల్లీలో ఉంటుంది. ఈ క్రమంలో రామ్ దేహి మహోర్ ఒక్కరే జీవనం సాగిస్తున్నారు. అయితే స్థానికంగా ఉండే ముస్లిం కుటుంబాలకు ఆ వృద్ధురాలు అప్పుడప్పుడు భోజనం పెట్టేది. అలా వారితో ఎంతో అప్యాయతగా ఉండేది ఆ వృద్ధురాలు. అక్కడి ముస్లిం యువత కూడా ఆ వృద్ధురాలిని సొంత తల్లిలాగా భావించే వారు. అలాంటి మంచి మనస్సున ఆ వృద్ధురాలు మరణించింది. ఆమె అంత్యక్రియలు నిర్వహించేందుకు అదే ప్రాంతంలో ఉండే బంధువులు వెనుకడుగు వేశారు. దీంతో ఆ వృద్ధురాలి అంత్యక్రియలు నిర్వహించేందుకు కొందరు ముస్లిం యువత ముందుకు వచ్చారు.
ఆమెను అమ్మలా భావించే మున్సిపల్ కార్పొరేషన్ ఉద్యోగి షకీర్ ఖాన్.. తన సోదరుడు, ఇతర స్నేహితులతో కలిసి హిందూ సంప్రదాయల ప్రకారం ఆమె అంత్యక్రియలకు ఏర్పాటు చేశారు. ఆ వృద్ధురాలి మృతదేహాన్ని భుజాన మోసుకుని శ్మశానవాటికకు తీసుకెళ్లారు. ఇదే సమయంలో రామ్ దేహి కూతురు షీలా గ్యాలియర్ వచ్చింది. తల్లి మృతిని తట్టుకోలేక కన్నీరుమున్నీరుగా విలపించింది. అనంతరం తన తల్లి చితికి నిప్పంటించారు. తమకు అన్నంపెట్టిన ఆ తల్లికి అంత్యక్రియాలు చేసి.. రుణం తీర్చుకున్నారు ఆ ముస్లిం యువత. మతాల పిచ్చితో కొట్టుకునే కొందరిని చూసి మనిషిలాగా మారాలని స్థానికులు కోరుకున్నారు. మరి.. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.