నేటి కాలంలో వివాహేతర సంబంధాలు పెరిగిపోతున్నాయి. వీటివల్ల పచ్చని సంసారాలు నిట్టనిలువునా చీలిపోతున్నాయి. అయితే ఇది నాణ్యానికి ఓ వైపు మాత్రమే. అక్రమ సంబంధం పెట్టుకుందని, దొంగతనం చేసిందనే అనుమాలతో మహిళలపై దాడులు జరుగుతున్నాయి. కొన్ని ఘటనల చూసినప్పుడు మానవత్వం మంటకలిసిందా? అనే సందేహం రాకమానదు. తాజాగా ఓ మహిళను వివస్త్రను చేసి నలుగురు మహిళలు దారుణంగా కొట్టి గాయపర్చినారు. అక్రమసంబంధం పెట్టుకుందనే అనుమానంతో ఆ మహిళపై దాడికి పాల్పడ్డారు. ఈఘటన అసోంలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం..
అసోంలోని అమ్గురి హల్వాటింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వౌలిపుఖురి గ్రామంలో అక్రమ సంబంధం కొనసాగిస్తుందనే అనుమానంతో శుక్రవాం సాయంత్రం ఓ మహిళపై నలుగురు మహిళలు దాడి చేశారు. మహిళను తాడుతో కట్టేసి, చెప్పుతో కొట్టి, దారుణంగా జుట్టు లాగి, బట్టలు చింపేసి కొట్టారు. తాను ఏ తప్పు చేయలేదని, కనికరించి వదిలేయాలని వేడుకున్న ఆ సదరు మహిళలు మాత్రం చలించలేదు. ఇంకా ఆమెపై దాడిని పెంచారు. మహిళ ఒంటిపై బట్టలు చింపేస్తూ హింసించారు. తనను వదిలేయాలని ఆమె గుండెలు బాదుకున్న ఆ నలుగురు ఆడవారి గుండెలు చలించలేదు. ఈ ఘటన మొత్తాన్ని అక్కడే ఉన్న ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు.
ఈ దాడి ఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఘటన స్థలానికి పోలీసులు చేరుకునే సమయానికి కూడా ఆ నలుగురు మహిళలు బాధిత మహిళపై దాడి చేస్తూనే ఉన్నారు. అయితే నిందితులపై చర్యలు తీసుకోకుండా పోలీసులు బాధితురాలిని, ఆమె భర్తను అదుపులోకి తీసుకున్నారు. దాడి ఘటనపై, పోలీసుల చర్యలపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడికి పాల్పడిన ఆ నలుగురు మహిళలను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. మరి.. ఈఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.