ఈ మధ్యకాలంలో తరచూ ఏదో ఒక ప్రాంతంలో ఘోర అగ్నిప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. షార్ట్ సర్క్యూట్, ఇతర పేలుళ్లు కారణంగా అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ప్రమాదాల కారణంగా ఎందరో అమాయకులు బలైపోతున్నారు. తాజాగా ఓ షిప్ లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 31 మంది దుర్మరణం చెందారు.
ఈ మధ్యకాలంలో తరచూ ఏదో ఒక ప్రాంతంలో ఘోర అగ్ని ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. షార్ట్ సర్క్యూట్, ఇతర పేలుళ్లు కారణంగా అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ప్రమాదాల కారణంగా ఎందరో అమాయకులు బలైపోతున్నారు. మరెందరో తీవ్రగాయాలతో దుర్బర జీవితాన్ని అనుభవిస్తున్నారు. ఇటీవలే సికింద్రాబాద్ ప్రాంతంలో ఓ కాంప్లెక్స్ లో జరిగిన అగ్నిప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. అలానే కొన్ని నెలల క్రితం ఓ భవనంలో అగ్నిప్రమాదం సంభవించి ముగ్గురు సజీవ దహనం అయ్యారు. తాజాగా ఓ షిప్ లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 31 మంది దుర్మరణం చెందారు. ఈ ఘటన దక్షిణ ఫిలిప్సిన్ లో చోటుచేసుకుంది. స్థానిక అధికారులు తెలిపిన వివరాల ప్రకారం..
బుధవారం దక్షిణ ఫిలిప్పీన్స్ ప్రాంతంలోని లేడీ మేరీ జాయ్ 3 అనే ఫెర్రీ మిండానావో ద్వీపంలోని జాంబోంగా నుండి జోలో అనే ద్వీపానికి ప్రయాణిస్తుండగా అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో ప్రాణాలు కాపాడుకునేందుకు చాలా మంది నీటిలోకి దూకారు. ఈ అగ్నిప్రమాదంలో 31 మంది మృతి చెందారు. అలానే 230 మందిని కాపాడినట్లు అధికారులు గురువారం తెలిపారు. అకస్మాత్తుగా జరిగిన ఈ ప్రమాదం నుంచి తప్పించుకునేందుకు ప్రయాణికులు పైనుంచి దూకాల్సి వచ్చిందని విపత్తు అధికారి నిక్సన్ అలోంజో తెలిపారు. బలుక్ ద్వీపంలోని ఫెర్రీలో మంటలు చెలరేగడంతో ఫిలిప్పీన్ తీర సిబ్బంది, మత్స్యకారులతో సాయంతో 195 మంది ప్రయాణికులు, 35 మంది సిబ్బందిని రక్షించారు.
అలానే ఓడలో 18 మృతదేహాలను గుర్తించారు. అగ్నిప్రమాదం సంభవించినప్పుడు ప్రయాణికులందరూ నిద్రలో ఉన్నందున భయాందోళనలకు గురయ్యారు. మంటలు భారీగా వ్యాపించడంతో కెప్టెన్ ఓడను వేగంగా డ్రైవ్ చేశాడు. తొలుత 14 మంది గాయపడ్డారని, ఏడుగురు గల్లంతయ్యారని అధికారులు తెలిపారు. ఆ తరువాత కాలిపోయిన ఓడ శిథిలాల్లో అనేక మంది మృతదేహాలను గుర్తించారు. ప్రమాద సమయంలో 300 వరకు ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రాణాలతో బయటపడిన వారిని జాంబోంగా, బాసిలన్ లోని ఆస్పత్రులకు తరలించారు.. అక్కడ గాయపడిన వారికి వైద్యులు చికిత్స అందిస్తున్నారని అధికారులు చెప్పారు. మరి..ఈ ఘోర అగ్ని ప్రమాదం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
BREAKING: At Least 31 Die In Philippines Ferry Fire https://t.co/mycFbiDKEt
— GordonsNews (@NewsGordons) March 30, 2023