ఈ మధ్యకాలంలో తరచూ ఏదో ఒక ప్రాంతంలో ఘోర అగ్నిప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. షార్ట్ సర్క్యూట్, ఇతర పేలుళ్లు కారణంగా అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ప్రమాదాల కారణంగా ఎందరో అమాయకులు బలైపోతున్నారు. తాజాగా ఓ షిప్ లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 31 మంది దుర్మరణం చెందారు.
బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. ఓ నౌకలో అగ్ని ప్రమాదం జరిగి.. ఏకంగా 37 మంది సజీవదహనం అయ్యారు. తెల్లవారుజామున సమయంలో ఈ ఘటన జరిగినట్లు తెలిపారు. ఈ ఘటనలో చాలా మంది గాయపడిన వారికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. శుక్రవారం తెల్లవారుజామున ఢాకా నుంచి బరుంగా బయల్దేరిన ఫెర్రీలో ఈ ప్రమాదం సంభవించింది. ఢాకాకు దక్షిణంగా 250 కిలోమీటర్ల దూరంలోని జల్కోటి సమీపంలో జరిగింది. ప్రమాద సమయంలో […]