ఇటీవల మావోయిస్ట్ అగ్రనేత ఆర్కే అనారోగ్యంతో మరణించటంతో మావోయిస్ట్ పార్టీ తీవ్ర విషాదంలో మునిగిపోయి ఉంది. ఇక ఈ క్రమంలోనే మావోయిస్టులకు మరో షాక్ తగిలింది. తాజాగా తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో మావోయిస్టుల ఏరివేతలో భాగంగా పోలీసులకు మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్ కౌంటర్ లో ముగ్గురు మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసు అధికారులు తెలిపారు.
అయితే బీజాపూర్ జిల్లా తర్లగూడ ఈటవీ ప్రాంతంలో చోటు చేసుకున్న ఈ ఎన్ కౌంటర్ లో ఘటన స్థలంలో ఏకే-47, ఇతర రైఫిల్స్, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. అయితే ముగ్గురు మావోయిస్టుల మృతుల్లో పార్టీ అగ్రనేత ఉన్నట్లు తెలుస్తోంది. ఇలా వరుస ఎదురు దెబ్బలు తగులుతున్న మావోయిస్టులకు ముందు ముందు ఎలాంటి ప్రణాళికలు రూపొందిస్తారో చూడాలి మరి.