రాజకీయాలు కత్తిమీద సాము లాంటివి. ఓ వైపు ప్రత్యర్థులను ఎదుర్కొవాలి.. మరో వైపు కిందికి లాగాలని చూస్తున్న సొంత పార్టీ శత్రువులను ఓ కంట కనిపెడుతూ ఉండాలి. ఇది ప్రతీ రాజకీయా నాయకుడి జీవితంలో ఉండే సవాలే. ఎదుగుతున్న నాయకుడిని ఎదగకుండా అడ్డుకోవాలని చూడటం రాజకీయాలలో సర్వ సాధారణమైన విషయం. ఈ క్రమంలోనే అలాంటి ఎదుగుతున్న నాయకుడిని ఎన్ కౌంటర్ చేయాలని చూశారన్న వార్త ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ర్ట రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఆంధ్రప్రదేశ్ శాఫ్ చైర్మన్, రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు అయిన బైరెడ్డి సిద్దార్థ్ రెడ్డిని చంపాలని చూశారని.. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయనే స్వయంగా చెప్పుకొచ్చాడు. సిద్దార్థ్ రెడ్డిని ఎందుకు ఎన్ కౌంటర్ చేయాలనుకున్నారు? అసలు ఎవరు అతడిని చంపేయాలనుకున్నారు? మరిన్ని వివరాల్లోకి వెళితే..
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆశీర్వాదంతో.. ఆయన ప్రేమాభిమానాలతో రాష్ట్ర ప్రజలకు సేవ చేస్తున్నానని బైరెడ్డి సిద్దార్థ్ రెడ్డి చాలా సార్లు చెప్పాడు. సిద్దార్థ్ రెడ్డి ప్రస్తుతం ఏపీ శాఫ్ ఛైర్మన్ గా, రాష్ర్ట యువజన విభాగం అధ్యక్షుడిగా పార్టీకి సేవలందిస్తున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తనపై చేసిన హత్యా ప్రయత్నాల గురించి, ఎన్ కౌంటర్ చేయాలని చూసిన సంఘటనల గురించి వివరించాడు. పోలీసులు మిమ్మల్ని ఎన్ కౌంటర్ చేయాలని చూశారట నిజమేనా? అని యాంకర్ ప్రశ్నించగా.. సిద్దార్థ్ రెడ్డి సమాధానమిస్తూ..”ఎన్ కౌంటర్ చేయడానికి నేనేమీ తీవ్రవాదిని కాదు. ఇక నాపై హత్యా ప్రయత్నాలు అంటారా.. అవి గతంలో చాలానే జరిగాయి. గన్నులు తీసి పాయింట్ బ్లాక్ లో పెట్టిన రోజులు కూడా ఉన్నాయి. అదీ కాక అర్ద రాత్రి 2 గంటలకు వచ్చి పట్టుకు పోయిన రోజులు కూడా ఉన్నాయని” సిద్దార్థ్ రెడ్డి తెలిపాడు.
ఈ నేపథ్యంలోనే మరిన్ని విషయాలు వెల్లడిస్తూ.. “మమ్మల్ని అరెస్ట్ చేసి గంటలు గంటలు సెల్లో వేస్తారు. ఇవన్నీ ఎందుకు చేస్తారు? చంపడానికా? కాదు బెదిరించడానికి. ఎన్నో బెదిరింపులు చూసే ఇక్కడిదాకా వచ్చాను” అని సమాధానం ఇచ్చాడు సిద్దార్థ్ రెడ్డి. అంత చిన్న వయసులో ఇన్ని అటాక్ లు చూశాక కూడా మీరు రాజకీయాలను వదిలేయాలి అనుకోలేదా? అన్న ప్రశ్నకు..”ఇక్కడ మనం ఒక్క అడుగు వెనక్కి వేస్తే.. మనల్ని పూర్తిగా తొక్కేస్తారు. రాజకీయాల్లో లేకుండా చేస్తారు. అందుకే నేను భయపడలేదు. నా మీద ఎన్నో కేసులు పెట్టారు, కానీ ఏనాడు నేను తగ్గలేదు. అందుకే ఈ రోజు నేను ఈ స్థాయిలో ఉన్నాను. నాకు ఈ క్రమంలో చాలా మంది సహకరించారు వారందరికి నేను రుణపడి ఉంటాను” అని బదులిచ్చాడు సిద్దార్థ్ రెడ్డి.