భారీ వర్షాల కారణంగా ఉత్తరాది రాష్ట్రాల్లో వాగులు, నదులు పొంగిపొర్లుతున్నాయి. పలుచోట్ల వాహనాలు నీటి ప్రవాహంలో మునిగిపోయాయి. చాలాచోట్ల వరదలతో రాకపోకలు నిలిచిపోయాయి. కొండచరియలు విరిగి వాహనాలపై పడి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి.
వేసవికాలం తర్వాత వానాకాలం మొదలైంది. పలు చోట్ల వర్షాలు వెనకపట్టు పట్టినాయి. కొన్ని చోట్ల వానలు బీభత్సం సృష్టిస్తున్నాయి. లోతట్టు దిగువ ప్రాంతాలు వరదలతో జమదిగ్భంధం అయ్యాయి. ఉత్తరాది రాష్ట్రాల్లో భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. పలు కాలనీలు నీట మునుగడంతో జనం తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. పలు నగరాలు జలదిగ్భందంలో చిక్కుకుని రాకపోకలు నిలిచిపోయాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పలు చోట్ల వాహనాలు నీటి ప్రవాహంలో కొట్టుకుపోతున్నాయి. హిమాచల్ ప్రదేశ్, జమ్మూకశ్మీర్, మధ్యప్రదేశ్ది రాష్ట్రాలు భారీగా కురుస్తున్న వర్షాలకు అతలాకుతలం అవుతున్నాయి.
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఉత్తర భారత దేశంలో పలు రాష్ట్రాలు వరదలతో సతమతమవుతున్నాయి. ఢిల్లీ, హరియాణా, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో గత రెండు రోజులుగా కుండపోత వాన కురుస్తుంది. ఈ వానలకు లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. కొన్ని చోట్ల కొండచరియలు విరిగి రోడ్డుపై వెళుతున్న వాహనాలపై పడి ప్రమాదాలు జరుగుతున్నాయి. తాజాగా శనివారం రాత్రి ఉత్తరాఖండ్‌లో బండరాళ్లు రోడ్డుకు అడ్డంగా పడడంతో రాయిని తప్పించబోయి వాహనం అదుపుతప్పి నదిలోకి దూసుకెళ్లింది. వాహనంలో ఉన్న 11 మంది నదిలో పడిపోయారు. వారిలో ఆరుగురు గల్లంతయ్యారు. ఐదుగురిని మాత్రం రెస్క్యూ టీం రక్షించింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
ఉత్తరాఖండ్ తెహ్రీ జిల్లా గులార్ వద్ద ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కొండచరియలు విరిగి రోడ్డుమీద పడిపోయాయి. రోడ్డుకు అడ్డంగా ఉన్న బండరాయిని తప్పించబోయి వాహనం అదుపుతప్పి నదిలో పడిపోయింది. చుట్టుపక్కల స్థానికులు పోలీసులుకు సమాచారం అందించారు. పోలీసులు, అధికారులు ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. వాహనంలో మొత్తం 11 మంది ఉండగా ఐదుగురిని కాపాడగలిగారు. మిగతా ఆరుగురు గల్లంతయ్యారు. బాధితుత్లో ఆంధ్రప్రదేశ్ విజయనగరానికి చెందిన దంపతులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. నదిలో భార్యను రెస్క్యూ టీమ్ రక్షించగా.. భర్త ఆచూకీ కోసం గాలిస్తున్నారు. రక్షించిన వారిని హుటాహుటిన అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. డ్రైవర్‌తో సహా మరో ఆరుగురి కోసం రెస్క్యూ టీమ్ గాలిస్తున్నారు.