తల్లిదండ్రులు తమపిల్లలపై ఎన్నో ఆశలు పెట్టుకుంటారు. మంచి చదువు చదివి బంగారు భవిష్యత్ కి పునాధులు వేసుకుంటారని పాఠశాలలకు పంపుతారు. కానీ ఓ పాఠశాలలో జరిగిన ప్రమాదంలో ముగ్గురు విద్యార్థులు తమ భవిష్యతు ముగించుకోని తిరిగిరాని లోకాలకు వెళ్లారు. అధికారుల నిర్లక్ష్యానికి వీరు బలైయ్యారు. తమిళనాడులో ఈ విషాదం సంఘటన చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. తమిళనాడులోని తిరునెల్వేలి ఎగ్జిబిషన్ గ్రౌండ్ కు సమీపంలోని స్కాఫ్టర్ హైస్కూల్ అత్యంత పురాతనమైంది. శుక్రవారం ఉదయం.. స్కూల్లోని టాయిలెట్ గోడ కూలిపోయింది. అక్కడే ఉన్న ముగ్గురు విద్యార్థులపై శిథిలాలు పడటం వల్ల తీవ్రంగా గాయపడటం వలను స్పాట్లోనే ప్రాణాలు కోల్పోయారు. గాయపడిన మరో ఇద్దరు విద్యార్థులను వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరంతా ఎనిమిదవ తరగతి చదువుతున్న విద్యార్థులు. ఈ సంఘటనపై సంబంధిత అధికారులు అక్కడికి చేరుకోని ప్రమాదం తీరు పరిశీలించారు.
100 ఏళ్లకుపైగా నడుస్తోన్న ఈ స్కూల్లోని గదులు, గోడలు శిథిలావస్థకు చేరుకున్నా.. వాటిని ఏ అధికారులు పట్టించుకోవడం లేదని, వారి నిర్లక్ష్యంగానే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపించారు. విద్యార్థుల నిండు భవిష్యత్ కు బాటలు పరుచుకునే చోట.. వారి జీవితాలు అంతమైన ఘటన అందర్నీ కన్నీరు పెట్టిస్తుంది. ఈ సంఘటనపై తెలంగాణ రాష్ర్ట గవర్నర్ తమిళసై సౌందర రాజన్ సంతాపం తెలిపారు.
