తల్లిదండ్రులు తమపిల్లలపై ఎన్నో ఆశలు పెట్టుకుంటారు. మంచి చదువు చదివి బంగారు భవిష్యత్ కి పునాధులు వేసుకుంటారని పాఠశాలలకు పంపుతారు. కానీ ఓ పాఠశాలలో జరిగిన ప్రమాదంలో ముగ్గురు విద్యార్థులు తమ భవిష్యతు ముగించుకోని తిరిగిరాని లోకాలకు వెళ్లారు. అధికారుల నిర్లక్ష్యానికి వీరు బలైయ్యారు. తమిళనాడులో ఈ విషాదం సంఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. తమిళనాడులోని తిరునెల్వేలి ఎగ్జిబిషన్ గ్రౌండ్ కు సమీపంలోని స్కాఫ్టర్ హైస్కూల్ అత్యంత పురాతనమైంది. శుక్రవారం ఉదయం.. స్కూల్లోని టాయిలెట్ గోడ కూలిపోయింది. […]