సాధారణంగా వర్షాల కాలంలో ఇళ్లలోకి పాములు, తేళ్లు లాంటివి వస్తుంటాయి. పట్టణాల్లో కాస్త తక్కువే అయినా.. గ్రామీణ ప్రాంతాల్లో ఈ ఇబ్బందులు ఎక్కువగా ఉంటుంటాయి. ఇళ్లలోకి పాములు రావడంతో భయంతో వణికిపోతున్నారు. ఆ మద్య కర్ణాటకలోని శివమొగ్గలో ఒక ఇంట్లో షూస్ లో పాము దూరింది.. ముందుగా చూసుకోవడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. అప్పుడప్పుడు వాహనాల్లో పాములు దాక్కొని ఉన్న వీడియోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంటాయి. ఓ విద్యార్థిని స్కూల్ బ్యాగ్ లో పాము దూరడంతో అందరూ భయంతో పరుగులు తీశారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో జరిగింది. వివరాల్లోకి వెళితే..
మధ్యప్రదేశ్‌లోని శివపురి జిల్లాకి చెందిన పదవ తరగతి విద్యార్థిని స్కూల్ కి వెళ్లింది. క్లాస్ రూమ్ లో కూర్చున్న ఆ బాలిక పుస్తకం తీసుకునేందుకు బ్యాగ్ లో చేయి పెట్టింది.. ఏదో మెత్తగా తగలడంతో ఏంటా అని చూసింది. అందులో నుంచి ఒక పాము బుసలు కొడుతూ కనిపించడంతో క్లాస్ రూమ్ లో విద్యార్థులంతా ఒక్కసారిగా షాక్ తిన్నారు. అక్కడికి వచ్చిన ఉపాధ్యాయులు సైతం భయంతో వణికిపోయారు. పాముల పట్టే వ్యక్తికి ఫోన్ చేయడంతో అతను బ్యాగ్ ని బయటకు తీసుకు వచ్చి మెల్లిగా పామును బయటకు తీసి దగ్గరలోని అడవిలో వదిలి వచ్చాడు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
బహుషా ఇంట్లోనే ఆ బాలిక బ్యాగ్ లో పాము దూరి ఉండవొచ్చని అంటున్నారు. అదృష్టం కొద్ది ఎవరికీ ఏమీ కాలేదని.. కొద్ది క్షణాల్లో ప్రాణాపాయం తప్పిందని విద్యార్థిని, ఉపాధ్యాయులు అంటున్నారు. ఇటీవల కాలంలో భారీగా వర్షాలు పడుతున్న కారణంగా ఇళ్లల్లోకి పాములు, తేళ్లు లాంటివి దూరుతున్నాయని.. షూస్, బ్యాగ్ లు చెక్ చేసుకొని వేసుకోవాలని అంటున్నారు. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.