ఈ మద్య ప్రమాదాలు ఎలా వస్తున్నయో తెలియని పరిస్థితి నెలకొంది. తాజాగా జమ్మూ కశ్మీర్‌లోని ఓ ఆస్పత్రిలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో పలువురుకి తీవ్ర గాయాలు అయ్యాయి. అనంతనాగ్ జిల్లా షేర్బాగ్ ప్రాంతంలోని మెటర్నిటీ ఆస్పత్రిలో జరిగిన ఈ పేలుడులో అనేక మంది గాయపడ్డారు. ఈ ప్రమాదం గురించి సమాచారం అందుకున్న అధికారులు.. ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
ఇది కూడా చదవండి : ట్రాఫిక్ చలాన్ డిస్కౌంట్ ఆఫర్ కు భారీ స్పందన.. మీరు కట్టేశారా?
గాయపడిన వారిని అత్యవసర చికిత్స కోసం అనంత్‌నాగ్ ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించారు. అయితే క్యాంటీన్‌లోని సిలిండర్ లీకేజీ వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు వెల్లడించారు. సిలిండర్లు పేలడంతో పెద్ద ఎత్తున శబ్ధం రావడంతో అందరూ ఉలిక్కి పడ్డారు. భయంతో ఆసుపత్రిలో పెద్ద ఎత్తున గందరగోళం నెలకొంది. అయితే తీవ్రంగా గాయాలు అయినవారికి తమ ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతోందని అధికారులు తెలిపారు. వీరంతా తీవ్రంగా గాయపడ్డారని, పరిస్థితి విషమంగా ఉందని పేర్కొన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.