రాహుల్ గాంధీ ప్రస్తుతం భారత్ జోడో యాత్రలో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. దేశాన్ని మొత్తాన్ని ఒక తాటిపైకి తీసుకు రావాలనే లక్ష్యంతో ఈ పాదయాత్రను చేస్తున్నారు. ఈ యాత్ర ప్రస్తుతం ఉత్తర్ ప్రదేశ్ చేరుకుంది. అక్కడ ఒక అద్భుతమైన దృశ్యం ఆవిష్కృతమైంది. రాహుల్ అతని చెల్లి ప్రియాంక వాద్రా మధ్య ఉన్న అనుబంధం గురించి ఎవరికీ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన అన్న రాహుల్ గాంధీ తనకు బెస్ట్ ఫ్రెండ్ అని ప్రియాంక వాద్రా గతంలోనే వెల్లడించింది. రాహుల్ గాంధీ కూడా ఒక అన్నగా ప్రియాంక విషయంలో తన బాధ్యతలను విస్మరించబోనని చెప్పకనే చెప్పారు.
ఇప్పుడు వీళ్ల బంధం గురించి ఎందుకు చెప్తున్నాము అనుకుంటున్నారా? ఎందుకంటే ఉత్తర్ ప్రదేశ్ లో ఈ అన్నాచెల్లెలి అనురాగం మరోసారి బయట పడింది. ఉత్తర ప్రదేశ్ లో భారత్ జోడో యాత్ర సాగుతోంది. అయితే యూపీ కాంగ్రెస్ ఇన్ ఛార్జ్ గా ఉన్న ప్రియాంక వాద్రా ఆ యాత్రలో పాల్గొన్నారు. అక్కడ జరుగుతున్న సభలో అన్నతో ముచ్చటించారు. రాహుల్ గాంధీ ఆ సమయంలో చెల్లిని ఆప్యాయంగా దగ్గరకు తీసుకున్నారు. ఆమె మెడ చుట్టూ చేతులు వేసి ఆమెను దగ్గరకు తీసుకుని ముద్దు పెట్టుకున్నారు.
అన్న అలా చేసే సరికి ప్రియాంక వాద్రాకు నవ్వొచ్చింది. వారి మధ్య ఉన్న అనుబంధాన్ని మరోసారి చాటిచెప్పే దృశ్యాలు ఇవి. ఈ దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే ఈ ఘటన జరిగి రెండ్రోజులు కావొస్తంది. ప్రస్తుతం ప్రియాంక వాద్రా ఢిల్లీలో ఉన్నారు. బుధవారం సోనియా గాంధీ పోస్ట్ కొవిడ్ సమస్యలతో ఆస్పత్రిలో చేరినట్లు తెలుస్తోంది. తల్లికి తోడుగా ఉండేందుకు ప్రియాంక వాద్రా ఢిల్లీ చేరుకున్నారు. సోనియా గాంధీ ఆరోగ్యం కుదుట పడిన తర్వాతే ప్రియాంక తిరిగి యూపీలో జరుగుతున్న భారత్ జోడో యాత్రలో పాల్గొంటారని తెలుస్తోంది. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ఈ నెలాఖరుకు జమ్ము కశ్మీర్ లో చివరి దశకు చేరుకోనుంది.
❤️❤️ pic.twitter.com/9MIQKMIdAQ
— Congress (@INCIndia) January 3, 2023