ప్రముఖ దర్శకుడు సుకుమార్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో వచ్చిన పాన్ ఇండియా మూవీ ‘పుష్ప’ బాక్సాఫీస్ షేక్ చేసింది. కలెక్షన్ల సునామీ సృష్టించింది. సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు అంతెందుకు ప్రపంచ వ్యాప్తంగా పుష్ప.. పుష్పరాజ్.. తగ్గేదేలే.. నీ యవ్వ.. అంటూ ఎవరి నోట విన్నా ఈ డైలాగులు వస్తున్నాయి. బాలీవుడ్ ప్రేక్షకులను సైతం ఇందులో డైలాగ్స్ కట్టిపడేశాయి. ఇక పుష్ప డైలాగ్స్ తో ఎన్నో మీమ్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి.
ఒక్క మాటలో చెప్పాలంటే.. బన్నీ మ్యానరిజంకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. పుష్ప ప్రభావం ఎంతగా పడిందంటే.. టెన్త్ క్లాస్ చదువుతున్న ఒక విద్యార్థి చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తుంది. కోల్ కొతాకు చెందిన టెన్త్ క్లాస్ స్టూడెంట్ ఆన్సర్ పేపర్‌లో ఏకంగా పుష్ప డైలాగ్‌ను రాసేశాడు. పుష్ఫ.. పుష్పరాజ్.. పరిక్ష రాసేదే లే’ అంటూ పెద్ద అక్షరాలతో రాశాడు. ఆన్సర్ షీట్ చూసిన టీచర్ ఒక్కసారే అవాక్కయ్యాడు. ఆన్సర్ షీట్ ని ఫోటో తీసి నెట్టింట్లో పోస్ట్ చేశాడు.
మనోజ్ సర్కార్ అనే ట్విటర్ యూజర్ స్టూడెంట్ రాసిన ఆన్సర్ షీట్ ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు కొందరు పుష్ప మేనియాకు ఇది నిదర్శనమని కామెంట్స్ చేస్తుంటే, మరికొందరేమో పరీక్షల్లో ఇలా డైలాగులు రాయడమేంటని విమర్శిస్తున్నారు.
answer sheet me v pushpa raj🤣🤣 pic.twitter.com/3RVwDwB4to
— Manoj Sarkar (@manojsarkarus) April 4, 2022