ప్రతి ఒక్కరికి జీవితంలో ఏదో ఒకటి సాధించాలనే తపన ఉంటుంది. ఈ క్రమంలోనే సమాజంలోని కొందరు హేళనకు కూడా గురి చేస్తుంటారు. అవమానాలు, హేళనలు ధైర్యంగా ఎదుర్కొన్ని విజయం సాధించే వారు చాలా తక్కువ మంది ఉంటారు. అలానే ఓ ప్రొఫెసర్.. మిసెస్ క్వీన్ గా మారింది.
ప్రతి ఒక్కరికి జీవితంలో ఏదో ఒకటి సాధించాలనే తపన ఉంటుంది. ఈ క్రమంలోనే సమాజంలోని కొందరు హేళనకు కూడా గురి చేస్తుంటారు. అవమానాలు, హేళనలు ధైర్యంగా ఎదుర్కొన్ని విజయం సాధించే వారు చాలా తక్కువ మంది ఉంటారు. అలాంటి వారు సాధించిన విజయం మరెందరికో స్ఫూర్తిగా ఉంటుంది. అలాంటి వారిలో గుజరాత్ రాష్ట్రానికి చెందిన ప్రొఫెసర్ శిబానీ రాయ్. అసలు ఆమె కథ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
గుజరాత్ రాష్ట్రానికి చెందిన అహ్మదాబాద్ కు చెందిన శిబానీ రాయ్ అనే మహిళ ప్రొఫెసర్ గా పనిచేస్తుంది. ఆమె ఎత్తు కేవలం ఐదు అడుగులు మాత్రమే ఉంటుంది. దీంతో ఆమెను బంధువులు, స్థానికులు పొట్టి పిల్ల అంటూ కామెంట్స్ చేసేవారు. అయినా ఆమె వారి మాటలను పెద్దగా పట్టించుకోలేదు. తాను అందాల పోటీల్లో పాల్గొన్నాలని భావించేది.. ఐదు అడుగులు అనేది అందాల పోటీల్లో పాల్గొనాలనుకునే వారికి ఇదొక అనర్హతే. అయినా ధైర్యంగా అందాల పోటీకి దరఖాస్తు పంపింది.
వివిధ వడపోతల తర్వాత మిసెస్ ఇండియా క్వీన్ అందాల పోటీల్లో విజేతగా నిలిచింది. ఇక బాలీవుడ్ బ్యూటీ శిల్పాశెట్టి చేతుల మీదుగా శిబానీ రాయ్ అందాల కిరీటం అలంకరించుకున్నది. ఇక మిసెస్ ఇండియా క్వీన్ కిరీటం గెలవడంతో ఆమె ఆనందానికి అవధులు లేవు. కుటుంబ సభ్యులు సైతం సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఆమెను పొట్టి పిల్ల అంటూ కామెంట్స్ చేసిన వారే.. ఆమెపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ప్రస్తుతం ఆమె మిసెస్ ఇండియా క్వీన్ హోదా స్వీకరించింది.
ఆమె ఓ మేనేజ్‌మెంట్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పని చేస్తుంది. అలానే పీహెచ్‌డీ సిద్ధాంత వ్యాసం చివరి దశలో ఉంది. ఇంక అందాల పోటీలో పరిచయ కార్యక్రమం, బీచ్ వేర్, డెజర్ట్ షూట్.. ఇలా అన్ని దశలూ దాటుకుని ఇంటర్వ్యూకు చేరుకుంది. జడ్జీలు అడిగిన ప్రశ్నకు ఆమె అదిరిపోయే సమాధానం ఇచ్చింది. ఆమె మాట్లాడుతూ..మహిళ కోసం మరో మహిళ నిలబడాలంటూ పదునైన సమాధానం ఇచ్చింది. మరి.. ఈ మహిళపై సక్సెస్ స్టోరీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.