కేంద్ర ప్రభుత్వం ఎన్నో అభివృద్ది సంక్షేమ పథకాలు అమలు చేస్తూ వస్తుంది. ముఖ్యంగా మహిళల కోసం పలు రకాల స్కీములు అందుబాటులోకి తీసుకువస్తుంది.
కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తూ వచ్చింది. ఇందులో ప్రత్యేకించి మహిళల కోసం పలు అభివృద్ది సంక్షేమ పథకాలు అందుబాటులోకి తీసుకువచ్చింది. గర్భిణి మహిళల కోసం మాతృ వందన యోజన పథకం కింద మహిళలకు రూ. 5 వేలు అందిస్తుంది. ఈ డబ్బులు విడతల వారీగా సదరు మహిళ ఖాతాలోకి నేరుగా చేరుతాయి. మొత్తంగా మూడు విడుతల్లో మహిళ ఖాతాలోకి డబ్బులు వస్తాయి. మొదటి విడతాలో గర్భిని మహిళల ఖాతాలో రూ.1000 వస్తాయి.. రెండో విడతాలో రూ.2000 వేలు, మూడో విడతాలో మరో రూ.2 వేలు వస్తాయి. ఈ విధంగా అర్హురాలైన గర్భిణి బ్యాంక్ ఖాతాలో పూర్తిగా రూ.5 వేలు వస్తాయి.
ప్రధాన్ మంత్రి మాతృ వందన యోజన పథకంలో ఎలా చేరాలంటే.. ముందుగా ఆన్‌లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సదరు గర్బిణీలు పట్టణాల్లోకానీ, గ్రామాల్లో కానీ ఎక్కడైనా సరే ఆశా వర్కర్ ని కలిస్తే ఈ స్కీమ్ గురించి వివరాలు వెల్లడిస్తారు.. ఈ స్కీమ్ లో చేర్పిస్తారు. లేదంటే https://pmmvy-cas.nic.in/public/beneficiaryuseraccount/login లింక్ ద్వారా నేరుగా మీరు వెబ్ సైట్ లోకి వెళ్లవొచ్చు. అందులో బెనిషిషియర్ ని లాగిన్ చేసి పూర్తి వివరాలు ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
ఈ పథకంలో చేరడానికి గల అర్హతల విషయానికి వస్తే.. దేశంలో గర్భిణీ స్త్రీలు అందరికీ ఈ పథకం వర్తిస్తుంది. అయితే ఈ పథకం తొలి ప్రసవానికి మాత్రమే వర్తిస్తాయి. అన్ని రాష్ట్రాల్లో ఈ స్కీమ్ అమల్లో ఉంది. ఈ పథకంలో లబ్ది పొందాలనుకునేవారికి ఎల్ఎంపీ డేట్ కచ్చితంగా ఉండాలి. ఎంసీపీ కార్డు కూడా కలిగి ఉండాలి, వీటిని మీరు ఆశా వర్కర్ దగ్గర నుంచి పొందవొచ్చు. ఇవి ఉంటేనే పథకం ప్రయోజనాలు పొందవొచ్చు. తొలిసారి గర్భిణిలకు మాత్రమే ఈ స్కీమ్ వర్తిస్తుంది. అలాగే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు చేసే మహిళలు ఈ పథకంలో చేరే అవకాశం ఉండదు.