మనం సాధారణంగా పోలీస్ బ్యాండ్ ను కేవలం గణతంత్ర, స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా వింటుంటాము. అలానే ఇతర ప్రభుత్వ కార్యక్రమాల సందర్భంగా కూడా ఈ పోలీస్ బ్యాండ్ ను వింటుంటాం. అయితే త్వరలో పెళ్లిల్లో కూడా పోలీస్ బ్యాండ్ మోగనుంది.
ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లి అనేది ఓ తీపి జ్ఞాపకం. అందుకే ఆ మధుర జ్ఞాపకాలను జీవితాంతం గుర్తుంచుకునేలా తమ పెళ్లిని ఎంతో ఘనంగా జరుపుకోవాలని యువత భావిస్తుంది. పెళ్లి మండపాన్ని ఎంతో అందంగా అలకరిస్తారు. అలానే వధువరుల ఇళ్లను విద్యుత్ కాంతుల వెలుగులతో మిరిమిట్లు గొలిపేలా అలంకరిస్తారు. ఇక వధువరులను పెళ్లి మండపం వద్దకు ఊరేంగింపుగా బ్యాండ్ మేళాలతో తీసుకెళ్తుండారు. ఆ బ్యాండ్ మేళాల ముందు వధువరుల బంధువులు డ్యాన్స్ చేస్తూ సందడి చేస్తారు. ఇక బ్యాండ్ మేళం వారు కూడా వివిధ రకాల సంగీతాన్ని వినిపిస్తూ పెళ్లికి వచ్చిన వారిని ఉత్సాహా పరుస్తారు. అయితే పెళ్లిలలో పోలీస్ బ్యాండ్ ఉండే బాగుండని కొందరు భావిస్తుంటారు. అలాంటి వారి కోరికను తీర్చడానికి ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి పెళ్లిలకు పోలీసుల బ్యాండ్ మోగనుంది. అయితే ఛారీలు, ఇతర వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
సాధారణంగా పోలీస్ బ్యాండ్ ను కేవలం గణతంత్ర, స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో మోగిస్తారు. అలానే ఇతర ప్రభుత్వ కార్యక్రమాల్లోనూ పోలీస్ బ్యాండ్ మోగుతుంది. అయితే పంజాబ్ రాష్ట్ర పోలీస్ డిపార్ట్మెంట్ మాత్రం అందరిని ఆశ్చర్యపరిచేలా ఓ వినూత్న నిర్ణయం తీసుకుంది. పెళ్లిలలో పోలీస్ బ్యాండ్ మోగాలని కోరుకునే వారి కలను నిరవేర్చేలా కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. సామాన్యుల శుభకార్యాల్లోనూ పోలీస్ బ్యాండ్ వినే అవకాశాన్ని పంజాబ్ పోలీస్ శాఖ కల్పించింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులను అధికారులు విడుదల చేశారు. అయితే ఈ పోలీస్ బ్యాండ్ తమ పెళ్లిలో వినాలనుకునే వారు కొంత రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఈ బ్యాండ్ కోసం ముందే బుక్ చేసుకోవాలి.
అలా పోలీస్ బ్యాండ్ ఓ గంట సమయం కావాలంటే రూ.5000 నగదు చెల్లించాలి. బుకింగ్ చేసుకున్న నిర్ణీత సమయం దాటితే మాత్రం.. గంటకు ప్రభుత్వ ఉద్యోగులు అయితే రూ.2,500, సామాన్య ప్రజలు అయితే రూ.3,500 చొప్పున అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. అలానే కుటుంబ వేడుకల కోసమైతే రూ. 7,000 నగదు చెల్లించే విధంగా అధికారులు నిర్ణయించారు. ఈ బ్యాండ్ బుకింగ్ పోలీస్ శాఖ ప్రత్యేక కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేసింది. అంతేకాక హెల్ప్ లైన్ నంబరును కూడా ఏర్పాటు చేసింది. మరి.. పెళ్లిల్లో పోలీస్ బ్యాండ్ మోగించాలని పంజాబ్ పోలీస్ శాఖ తీసుకున్న నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.