దేశంలో ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు ముగిసిన తర్వాత అందరూ ఊహించినట్లుగానే ఇంధన రేట్లు పెరిగాయి. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగియడంతో.. 137 రోజుల తర్వాత ధరలను పెంచుతూ చమురు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. వాహనదారులకు చమురు సంస్థలు భారీ షాక్ ఇచ్చాయి. దేశవ్యాప్తంగా లీటర్ పెట్రోల్ పై 91 పైసలు, డీజిల్ పై 88 పైసలు పెంచాయి. తెలంగాణలో లీటర్ పెట్రోల్‌పై 90 పైసలు, డీజిల్‌పై 87 పైసలు పెరిగాయి. దాంతో హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ రూ. 109.10 కాగా.. డీజిల్ రూ. 95.40 పైసలకు చేరింది.
ఇక పెరిగిన ధరలు నేటి (మార్చి 22) నుంచి అమల్లోకి వచ్చాయి. ఏపీలో లీటర్ పెట్రోల్‌పై 88 పైసలు, డీజిల్‌పై 83 పైసలు పెరిగాయి. దీంతో విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర రూ. 110.80లుగా ఉండగా.. డీజిల్ రూ. 96.83గా ఉంది. గుంటూరులో లీటర్ పెట్రోల్ ధర రూ. 111.21, డీజిల్ ధర రూ. 97.26గా నమోదైంది. గతేడాది నవంబర్ 4 నుండి ధరలు పెరగలేదు. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం కారణంగా ఇటీవల అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు గరిష్టానికి చేరుకున్న సంగతి తెలిసిందే. అయితే రోజురోజుకు చమురు సంస్థల నష్టాలు పెరుగుతుండడంతో పెట్రోలు, డీజిల్ ధరలను పెంచడం అనివార్యంగా మారినట్లు అభిప్రాయం వ్యక్తమవుతోంది.
మరికొన్ని రోజుల పాటు చమురు ధరలు పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 96.21, డీజిల్ ధర రూ. 87.47గా ఉంది. వాణిజ్య నగరం ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ. 110.82, డీజిల్ ధర రూ. 95.00గా ఉంది. కోల్‌కతాలో పెట్రోల్ రూ. 105.51, డీజిల్ రూ. 90.62లుగా ఉండగా.. చెన్నైలో పెట్రోల్ రూ. 102.16, డీజిల్ ధర రూ. 92.19గా నమోదైంది.