మనిషిలోని కసి, పట్టుదల ఓర్పును కలిగిస్తుంది. ఆ ఓర్పుతో నిత్యం శ్రమించే వారిని ఏదో ఓ రోజు విజయం తప్పక వరిస్తుంది. పనిని భగవంతునిలా భావించి శ్రమించిన వారి చెంతకే విజయం తప్పక చేకూరుతుంది. అందుకు నిదర్శనమే బెంగాల్ కు చెందిన నారాయణ్ మజుందార్. కొన్నేళ్ల క్రితం పాలు అమ్మిన వ్యక్తే.. నేడు కోట్లకు అధిపతిగా మారారు.
మనిషిలోని కసి, పట్టుదల ఓర్పును కలిగిస్తుంది. ఆ ఓర్పుతో నిత్యం శ్రమించే వారిని ఏదో ఓ రోజు విజయం తప్పక వరిస్తుంది. పనిని భగవంతునిలా భావించి శ్రమించిన వారి చెంతకే విజయం తప్పక చేకూరుతుంది. ఓ నిరుపేద కుటుంబంలోని రైతు కుమారుడు నేషనల్ ఇన్ స్టిట్యూట్ బయట పాలు అమ్మి.. అంచెలంచెలుగా ఎదిగి నేడు వందల కోట్లకు అధిపతిగా నిలిచాడు. అతని విజయం వెనుక ఉన్న కృషి, పట్టుదలను ప్రశంసించాల్సిందే. ఇంతకీ ఎవరతను? ఆయన సక్సెస్ స్టోరీ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
పశ్చిమ బెంగాల్ లోని నదియా జిల్లాలో ఒక పేద రైతు కుటుంబంలో నారాయణ్ మజుందార్ జన్మించాడు. పుట్టిన ఊరిలోనే పాఠశాల విద్యను పూర్తి చేశాడు. తరువాత పై చదువుల కొరకు “ఎన్డీఆర్ఐ” లో చేరాడు. అప్పట్లో అతని కోర్సుకి రూ. 250 ఖర్చు అయ్యేవి. ఆ రోజుల్లో ఆ రూపాయలే పెద్ద అమౌంట్. చదువుతో పాటు ఏదైనా పార్ట్ టైం జాబ్ చేయాలనుకున్నాడు మజుందార్. ఉదయం 5 నుంచి 7 గంటల వరకు పాలు అమ్మేవాడు. అది కాకుండా రూ.100 స్కాలర్ షిప్ కూడా వచ్చేవి.
ప్రతినెల అతని తండ్రి దగ్గర నుండి రూ.100 కూడా అందేవి. ఇలా కొంతకాలం చదువును కొనసాగించారు. అతని కాలేజీ చదువు పూర్తి అయ్యే నాటికి వారి వ్యవసాయ భూమిని అమ్మేశారు. కోల్ కతాలోని క్వాలిటీ ఐస్ క్రీమ్ లో డైరీ కెమిస్ట్ గా నారాయణ్ ఉద్యోగం చేస్తూ.. నెలకు రూ.600 సంపాదించే వారు. తరువాత సిలిగురి లో చేరాడు. అక్కడ మదర్ డెయిరీ మేనేజర్ డా.జగ్జీత్ పుంజార్థ్ తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయమే మజుందార్ జీవితం పెద్ద మలుపు తిరగడానికి కారణం అయ్యింది. ఆ తరువాత హౌరాలోని ఒక కంపెనీలో జనరల్ మేనేజర్ గా చేరారు.
నారాయణ్ 1999లో రూ.10 లక్షల పెట్టుబడితో శీతలీకరణ ప్లాంటు ఏర్పాటు చేశాడు. తరువాత ఒక సంవత్సరం పాటు పాల ట్యాంకర్ కొనగోలు చేసి తన భార్య భాగస్వామ్యంతో ఒక సంస్థను స్థాపించాడు. 2003లో రెడ్ కౌ డైరీని స్థాపించాడు. 2007లో కోల్ కతా డెయిరీలో పార్ట్ నర్ షిప్ కుదుర్చుకున్నారు. ఇప్పుడు ఆయన కంపెనీలో 1000 మంది పనిచేస్తున్నారు. ఈయనకు బెంగాల్ లోని 12 జిల్లాల్లో 3 లక్షల మందికి పైగా రైతులతో వ్యాపార పరంగా సత్సంబంధాలున్నాయి.
ప్రస్తుతం నారాయణ్ మజుందార్ కంపెనీ ప్రతిరోజు 4 లక్షల లీటర్ల పాలను ఉత్పత్తి చేస్తుంది. 35 పాల శీతలీకరణ ప్లాంట్లతో పాటు 400 డిస్ట్రిబ్యూటర్లు ఉన్నాయి. ఒకప్పుడు సైకిల్ పై పార్ట్ టైమ్ గా ప్రారంభించిన ఉద్యోగం ఇప్పుడు రూ.800 కోట్ల సామ్రాజ్యంగా ఏర్పడింది. నారాయణ్ మజుందార్ నేటి తరం యువతకు గొప్ప ఆదర్శం. ఈ విజయ గాథపై మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి.