దేశంలో నిత్యం ఏదో ఒక చోట బంగారం అక్రమ రవాణాకు సంబంధించి వార్తలు వెలుగు చూస్తూనే ఉంటాయి. విమానాశ్రయాల్లో బంగారం స్మగ్లింగ్ చేయడానికి ప్రయత్నించి పట్టుబడే వారి సంఖ్య రోజు రోజు పెరుగుతూనే ఉంది. అయితే ఈ సారి అధికారులు ఏకంగా 100 కేజీలకు పైగా బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ వివరాలు..
బంగారం ధర చుక్కలను తాకుతున్న నేపథ్యంలో కొందరు అక్రమంగా విదేశాల నుంచి భారీ ఎత్తున బంగారాన్ని దొంగ మార్గంలో మన దేశంలోకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు. విమానాశ్రాయాల్లో రోజు ఎంతో కొంత బంగారం పట్టుబడుతూనే ఉంది. అయితే ఇప్పటి వరకు స్వాధీనం చేసుకున్న బంగారం ఒక లెక్క.. నిన్న పట్టుబడిన బంగారం ఒక లెక్క. ఏకంగా 100 కిలోలకు పైగా పసిడి పట్టుబడింది. ఆపరేషన్ గోల్డెన్ డాన్ పేరిట అధికారులు నిర్వహించిన సోదాల్లో.. అంతర్జాతీయ బంగారం అక్రమ రావాణా ముఠా ఒకటి పట్టుబడింది. వీరి వద్ద నుంచి అధికారులు ఏకంగా 101.7 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నారు. ఆ వివరాలు..
డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డిఆర్‌ఐ) అధికారులు అక్రమ బంగారం రవాణా ముఠా ఆట కట్టించే విషయంలో విజయం సాధించారు. “ఆపరేషన్ గోల్డెన్ డ్వాన్” పేరుతో నేపాల్-ఇండియన్ బార్డర్ సహా పలు దేశంలోని ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలో ఏడుగురు సూడాన్ జాతీయులతో సహా 10 మంది ముఠా సభ్యులను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 51 కోట్ల రూపాయల విలువైన 101.7 కిలోల బంగారాన్నిస్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి డీఆర్‌ఐ అధికారులు పది మంది నిందితులను గుర్తించగా.. వీరిలో ముగ్గురు భారతదేశానికి చెందినవారు ఉన్నారు. పట్టుబడిన సైఫ్ సయ్యద్ ఖాన్, షంషేర్ ఖాన్, మనీష్ ప్రకాష్ జైన్‌లను భారతీయులుగా గుర్తించారు డీఆర్‌ఐ అధికారులు. మిగిలిన వారిని సూడాన్ జాతీయులుగా గుర్తించారు.
మూడు రోజుల పాటు సాగిన ఆపరేషన్‌లో.. అధికారులు ముంబైలోని కోల్బా, జవేరీ బజార్‌లోని నాలుగు ప్రదేశాలతో మరి కొన్ని కీలక ప్రదేశాల్లో సోదాలు నిర్వహించారు. ఇక బంగారం అక్రమ రవాణా చేసే ముఠా ఇండో-నేపాల్ సరిహద్దు మార్గాన్ని ఉపయోగిస్తున్నారనీ, అక్రమంగా రవాణా చేయబడిన బంగారాన్ని నేపాల్ నుండి బిహార్‌కు తీసుకువస్తున్నారని వెల్లడించారు. ఆ తర్వాత బంగారాన్ని రైలు, విమాన మార్గంలో ముంబైకి రవాణా చేస్తున్నారని డీఆర్‌ఐ అధికారి ఒకరు తెలిపారు.
ఫిబ్రవరి 18న చేపట్టిన ఈ ఆపరేషన్ మూడు రోజుల పాటు నిర్వహించినట్టు డీఆర్ఐ అధికారులు పేర్కొన్నారు. అలాగే, ముంబయిలోని కోల్బాకు చెందిన సైఫ్, షంషేర్ ఇద్దరూ సోదరులని, ఈ ఇద్దరూ విదేశీయుల నుంచి బంగారం కొనుగోలు చేసి.. జవేరీ బజారులోని బంగారు నగల వ్యాపారి మనీష్‌కు అమ్ముతున్నారని వెల్లడించారు. ఇంత భారీ మొత్తంలో బంగారంపట్టుబడటం కలకలం రేపుతోంది. మని ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.