డబ్బుకు లోకం దాసోహం.. డబ్బు కోసం ఈ మద్య కొంత మంది ఏ పనిచేయడానికైనా వెనుకాడటం లేదు. ఈజీ మనీ కోసం కొంతమంది కేటుగాళ్ళు ఎదుటి వారిని ఈజీగా బురిడీ కొట్టిస్తున్నారు. అక్రమ దందాలతో డబ్బు సంపాదిస్తున్నారు.
బంగారం, ఇతర ఖరీదైన వస్తువులను తరలించేందుకు స్మగ్లర్లు వివిధ మార్గాలను అన్వేషిస్తున్నారు. మొన్నటి వరకు సముద్ర, విమాన మార్గాల్లో టన్నుల కొలదీ బంగారం తరలి వచ్చేది. వీటిని ప్రయాణీకుల రూపంలో ఉన్న స్మగ్లర్లు పలు రూపాల్లో తీసుకు వచ్చేవారు. వారిని వెతికి పట్టుకోవడంలో కస్టమ్స్ అధికారులకు సవాళ్లు ఎదురయ్యేవి. తాజాగా ఏపీలో భారీ స్మగ్లింగ్ జరుగుతుండగా.. అధికారులు చేధించారు.
దేశంలో నిత్యం ఏదో ఒక చోట బంగారం అక్రమ రవాణాకు సంబంధించి వార్తలు వెలుగు చూస్తూనే ఉంటాయి. విమానాశ్రయాల్లో బంగారం స్మగ్లింగ్ చేయడానికి ప్రయత్నించి పట్టుబడే వారి సంఖ్య రోజు రోజు పెరుగుతూనే ఉంది. అయితే ఈ సారి అధికారులు ఏకంగా 100 కేజీలకు పైగా బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ వివరాలు..