ఈ మధ్యకాలంలో చాలామంది ప్రేమించి పెళ్లి చేసుకోవడం మామూలైపోయింది. ప్రేమించిన వ్యక్తి మంచివారైతే ఓకే లేదంటే వారి జీవితం అగమ్యగోచరంగా మారుతుంది. ఆడవారు, మగవారు అనే తేడా లేకుండా సమాజంలో ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించి నిజమైన ప్రేమకు గుర్తింపు లేకుండా చేస్తున్నారు.
ఈ మధ్యకాలంలో చాలామంది ప్రేమ పేరుతో మోసాలకు పాల్పడుతున్నారు. ఒకరిని ప్రేమించి కొద్ది రోజుల తర్వాత మరో వ్యక్తితో పరిచయాలు పెంచుకొని, వారితో కలిసి తిరుగుతున్నారు. ఒకరికి తెలియకుండా మరొకరిని లైన్ లో పెట్టడం.. చివరకు ప్రేమించిన అమ్మాయిలపై అకృత్యాలకు పాల్పడడం చేస్తున్నారు. ఈ విషయంలో ఆడవారు, మగవారు అనే తేడా లేకుండా తమ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించి చివరకు జీవితాన్ని అస్తవ్యస్తం చేసుకుంటున్నారు. పెళ్లి అయిన తర్వాత కూడా ఇలా ఇద్దరితో వ్యవహారం నడిపేవారు చాలా మంది ఉన్నారు. చివరకు మనుషుల మధ్య నిజమైన ప్రేమను గుర్తించలేకపోతున్నారు. తాజాగా ఓ ఘటనలో ఓ యువకుడు ప్రాణంగా ప్రేమించిన అమ్మాయిని దారుణంగా మోసం చేశాడు. ఆమెను ప్రేమిస్తున్నట్లు నటించి మరో అమ్మాయితో తిరుగుతున్నాడు. ఈ విషయం మొదట ప్రేమించిన అమ్మాయికి తెలిసి ప్రాణాలు తీసుకుంది. అసలు జరిగిన విషయం ఏంటో తెలుసుకుందాం. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
కర్ణాటక రాష్ట్రం మైసూర్ జిల్లాలోని కేఆర్ నగర్‌కు చెందిన.. నిసర్గ అనే యువతి బీకాం ఫైనల్ ఇయర్ చదువుతోంది. అదే ప్రాంతంలో సుహాన్ రెడ్డి అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఈ క్రమంలో నిసర్గకు షాకింగ్ న్యూస్ తెలిసింది. సుహాన్ వేరే అమ్మాయితో తిరుగుతున్నడని తెలిసింది. తనను కాదని సుహాన్ వేరే అమ్మాయితో తిరగడం చూసి తట్టుకోలేకపోయింది. తన చెయ్యి కోసుకుని ఆత్మహత్యాయత్నం చేసుకుంది. సుహాన్‌తో ఉన్న తన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
దీంతో సుహాన్, నిసర్గపై కోపగించుకుని చావమని బాగా తిట్టాడు. ఈ ఘటనతో నిసర్గ మరింత బాధపడి చావడానికి సిద్ధపడింది. తన చావుకు కారణం తన ప్రియుడు సుహాన్ అని సూసైడ్ లెటర్ రాసింది. ఆ తర్వాత విషం తాగింది. నిసర్గ కుటుంబసభ్యులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నిసర్గ చనిపోయింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సుహాన్‌ను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. దీనిపై మీ అభిప్రాయలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.