అరేబియా సముద్రం వేదికగా సాగుతున్న వేల కోట్ల రూపాయల అంతర్జాతీయ మాదకద్రవ్యాల ముఠా నెట్‌వర్క్‌ను ఇండియన్ కోస్ట్ గార్డ్ అధికారులు పక్కా ప్లాన్‌తో ఛేదించారు. లక్షద్వీప్‌కు పశ్చిమ వైపు ఉన్న అరేబియా సముద్ర జలాల్లో చేపట్టిన ఈ రెస్క్యూ & సెర్చ్ ఆపరేషన్‌లో ఏకంగా 3,000 కోట్ల విలువ చేసే 526 కిలోల భారీ డ్రగ్స్ ను పట్టుకుని ఐదుగురు పాకిస్థానీయులను అదుపులోకి తీసుకున్నారు.
గుజరాత్ ఉగ్రవాద నిరోధక దళం, ఇండియన్ కోస్ట్ గార్డ్ సంయుక్తంగా జరిపిన ఈ ఆపరేషన్ అత్యంత క్లిష్టంగా సాగింది. సముద్రంలో ఇరాన్ దేశానికి చెందిన ఒక అనుమానాస్పద బోట్ భారతదేశ తీరం వైపు అత్యంత వేగంగా దూసుకొస్తుందన్న ఇంటిలిజెన్స్ హెచ్చరికలతో కోస్ట్ గార్డ్ షిప్‌లు, విమానాలు రంగంలోకి దిగాయి. లక్షద్వీప్‌కు పశ్చిమాన సముద్రంలో ఈ బోట్‌ను చాకచక్యంగా ఛేజ్ చేసి, చుట్టుముట్టి అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
బోట్‌లోని రహస్య అరల్లో దాచి ఉంచిన సుమారు 526 కిలోల అత్యంత ప్రాణాంతకమైన డ్రగ్స్ సరకును అధికారులు రికవరీ చేశారు. ఇందులో భారీ పరిమాణంలో హెరాయిన్, మెథాంఫేటమిన్ ఉన్నట్లు కన్ఫర్మ్ చేశారు. వీటి విలువ
