మనుషులు ఎలా బతకాలో ఆశలు, కోరికలు పెట్టుకుంటారో.. అలాగే ఎలా చనిపోవాలి అనే దానిపై కూడా కలలు కంటూ ఉంటారు. దైవ చింతన కలిగిన భక్తులు తమకు ప్రశాంతమైన మరణం సంభవించాలని కోరుకుంటూ ఉంటారు. మంచానపడి నానా ఇబ్బందులు పడకుండా నిద్రలోనే కన్నుమాయాలని వేడుకుంటారు. అయితే ఇప్పుడు చెప్పుకోబోయే వ్యక్తి అలాంటి కోరికలు కోరుకున్నాడో లేదో తెలియదు గానీ, అలాంటి మరణానికి గురయ్యాడు. అయితే నిద్రలో కాదు.. బాబా సన్నిధిలో ఆయనికి మెక్కుతూ ప్రాణాలు వదిలాడు. స్వామివారి విగ్రహానికి నమస్కారం చేసుకుంటూ అలాగే ప్రాణాలు కోల్పోయాడు.
వివరాల్లోకి వెళ్తే.. ఈ ఘనట మధ్యప్రదేశ్ రాష్ట్రం కట్నీలో జరిగింది. రాజేశ్ మెహానీ అనే వ్యక్తి పహరువా మండీ రోడ్డులో మెడికల్ షాప్ నిర్వహిస్తూ ఉంటాడు. అతను బాబా భక్తుడు. ప్రతి గురువారం బాబా ఆలయానికి వెళ్తూ ఉంటాడు. ఎప్పటిలాగానే డిసెంబర్ 1వ తేదీన కూడా బాబా ఆలయానికి వెళ్లాడు. బాబా విగ్రహం చుట్టూ ప్రదిక్షణలు చేశాడు. తర్వాత బాబా విగ్రహం ముందు కూర్చుని నమస్కారం చేసుకున్నాడు. అలాగే 15 నిమిషాల పాటు ఉండిపోయాడు. ఎంతకీ లేవకపోవడంతో పూజారి అనుమానంతో రాజేశ్ మెహానీని తట్టి చూశాడు. అతను స్పందించలేదు. అతడిని పరీక్షించగా అపస్మారకస్థితిలో ఉన్నట్లు తెలిసింది. వెంటనే రాజేశ్ మెహానీని ఆస్పత్రికి తరలించారు. అయితే రాజేశ్ అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
రాజేశ్ మహానీ మృతికి సంబంధించి ఆలయం వారు సీసీటీవీ ఫుటేజ్‌ని విడుదల చేశారు. ఆ దృశ్యాల్లో ఎలాంటి అనుమానాస్పద విషయాలు కనిపించలేదు. రాజేశ్ సాధారణంగానే ప్రదిక్షణలు చేసుకుని విగ్రహం ముందు కూర్చున్నాడు. అయితే ఆ దృశ్యాలు పరిశీలించిన వైద్యులు.. ఇది సైలెంట్ మయోకార్డియల్ ఇన్ఫ్రాక్షన్(SMI) అయి ఉండచ్చని చెబుతున్నారు. అంటే సైలెంట్ హార్ట్ ఎటాక్. దీనివల్ల తలతిరగడం, ఛాతినొప్పి, ఒత్తిడి లాంటివి ఉన్నా కూడా పైకి ఆరోగ్యంగానే కనిపిస్తారని చెబుతున్నారు. ఇది వస్తే క్షణాల్లోనే ప్రాణాలు కోల్పోతారని చెప్పారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బాబా ఆలయంలో వ్యక్తి ఇలా ప్రాణాలు కోల్పోయారని తెలిసి స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు.
रहस्यमय मौत… कटनी में साईं मंदिर में दर्शन करते समय शख्स की हो गई मौत. गिरते ही हो गई उसकी वहीं पर मौत.#Trending #TrendingNow pic.twitter.com/rOAYx852eU
— Narendra Singh (@NarendraNeer007) December 4, 2022