ఇటీవల కాలంలో భార్య చేతిలో మోసపోతున్న అమాయకపు భర్తల గురించి కథలు విన్నాం. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఇద్దరు పురుషులు..తమ భార్యల చేతుల్లో మోసపోయిన సంగతి విదితమే. ఇలాంటి తరుణంలో మరో ఆసక్తి కథనం ఒకటి వెలుగు చూసింది.
ఇటీవల కాలంలో భార్యల చేతిలో మోసపోయిన భర్తల గురించి విన్నాం. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఇద్దరు పురుషులు..తమ భార్యలు ఎలా చీట్ చేశారో చెబతూ గొల్లుమన్న సంగతి విదితమే. అలోక్ అనే వ్యక్తి తన భార్య జ్యోతి మౌర్య కోరిక మేరకు ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రిపరేషన్ ఇప్పించి.. ప్రోత్సహించాడు. జ్యోతి సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్(ఎస్‌డిఎం) అయ్యాక.. మరో వ్యక్తి మోజులో పడి భర్తకు దూరంగా ఉండటమే కాకుండా.. అతడిపై వరకట్నవేధింపుల కేసు పెట్టి జైలులో పెట్టించింది. అలాగే కాన్పూరుకు చెందిన అర్జున్ కూడా ఇలాంటి బాధితుడే. భార్య సవిత మౌర్యను నర్సింగ్ చదివించాడు. నర్సుగా ఉద్యోగం వచ్చాక.. పొట్టిగా, నల్లగా ఉన్నావంటూ భర్తను ఎడం కాలితో తన్నిపోయింది. ఇలాంటి తరుణంలో మరో ఆసక్తి కథనం ఒకటి వెలుగు చూసింది.
తను ఉన్నత స్థితిలో చూడటం కోసం పాచి పనులు చేస్తూ మద్దతుగా నిలిచిన భార్యకు ఊహించని గిఫ్ట్ ఇచ్చాడు భర్త. ఆ గిఫ్ట్ ఏంటంటే ఆమెను వదిలి మరో మహిళను పెళ్లి చేసుకోవడం. ఈ ట్విస్ట్ వింటే మీరు కూడా ఆశ్చర్యపోతున్నారు కదా. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. దేవాస్ ప్రాంతానికి చెందిన కమ్రు హతిలే, మమత 2015లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆ సమయంలో కమ్రు నిరుద్యోగి. తినడానికి కష్టమౌతున్న ఆ రోజుల్లో భర్త ఉన్నతి కోసం పాటుపడింది. పోటీ పరీక్షలకు సిద్ధం కావాలని ప్రోత్సహించింది. దానికి అవసరమైన ఖర్చులు తాను భరిస్తానని బాధ్యత తీసుకుంది. పలు ఇళ్లల్లో పనిమనిషిగా చేరి అంట్లు, ఇళ్లు శుభ్రం చేయడం వంటి పనులు చేసింది. అంతేకాకుండా అతడి పుస్తకాల కోసం, మరింత డబ్బులు అవసరమైన నేపథ్యంలో షాపుల్లో కూడా పనిచేసింది.
ఆమె త్యాగానికి, అతడి కష్టానికి ప్రతి ఫలం దక్కింది. కమ్రు పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణుడై.. 2019-20లో వాణిజ్య పన్నుల అధికారి అయ్యారు. కమ్రుకు రత్లాంలో పోస్టింగ్ వచ్చింది. అక్కడకు వెళ్లాక మరో మహిళతో వివాహేతర సంబంధాన్ని ఏర్పరుచుకుని.. భార్య మమతను దూరం పెట్టసాగాడు. మమతను పుట్టింటికి పంపించి.. మరో మహిళతో సంసారం స్టార్ చేశాడు. ఈ విషయం తెలిసిన మమత అతడిని అడగ్గా.. ఆమెతో ఉండేందుకు నిరాకరించాడు భర్త. దీంతో ఆమె అతడిపై 2021లో కేసు పెట్టింది. అయితే ఆమెకు భత్యం రూ. 12 వేలు ఇచ్చేందుకు ఒప్పుకున్నాడు కానీ.. ఆమెతో కాపురం చేసేందుకు ససేమీరా అన్నాడు. అయితే తిరిగి ఇవ్వకపోవడంతో కోర్టును ఆశ్రయించింది. ఈ కేసు తదుపరి విచారణ జూలై 22న జరగనుంది. కాగా, మమతకు ఇది రెండో వివాహం.. ఆమె మొదటి భర్త చనిపోయాడు. ఆమె కుమారుడు కూడా 15 సంవత్సరాల వయస్సులో కొన్ని నెలల క్రితం మరణించాడు.