ఈ మద్య కాలంలో దేశ వ్యాప్తంగా వరుసగా రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. రోడ్డు భద్రతా చర్యలు ఎంత కఠినతరం చేసినా ఎక్కడో అక్కడ ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి. డ్రైవర్ల నిర్లక్ష్యం వల్లనే ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు అంటున్నారు.
దేశంలో ఈ మద్య వరుస రోడ్డు ప్రమాదాలు ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నాయి. ఇంటి నుంచి బయటికి వెళ్లి క్షేమంగా ఇంటికి చేరుతామా? లేదా? అన్న భయంతో బతుకుతున్నారు. డ్రైవర్ల నిర్లక్ష్యం, మద్యం సేవించి వాహనాలు నడపడం ఒకటైతే కొన్ని అనుకోని పరిణామాల వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. రోడ్డు ప్రమాదాల్లో ఎంతోమంది అమాయకులు చనిపోతున్నారు.. కొంతమంది కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. ట్రాఫిక్ అధికారులు ఎన్ని కఠిన చట్టాలు తీసుకువస్తున్నా.. ప్రతిరోజూ పదుల సంఖ్యల్లో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. మహారాష్ట్రలో ఓ సంఘటలన అందరినీ ఆశ్చర్యపరిచింది.. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వివరాల్లోకి వెళితే..
సాధారణంగా ఎవరితో అయినా గొడవకు దిగితే.. లాప్ లేచిపోద్ది అంటూ సరదాగా అంటుంటారు. మహారాష్ట్రల్లో నిజంగానే ఓ బస్సు లాప్ లేచిపోయిన ఘటనకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. మహారాష్ట్రలో అహేరి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు గడ్చిరోలి జిల్లాలో ప్రయాణికులతో బయలుదేరింది. ఆర్టీసీ బస్సు 60 స్పీడ్ లో వెళుతుంది.. అదేసమయంలో హఠాత్తుగా బస్సు రూఫ్ సగానికి పైగా లేచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. బస్సులో ఉన్న ప్రయాణికులు బస్సును ఆపండి అంటూ డ్రైవర్ ని అడిగారు.. కానీ బస్సు డ్రైవర్ ఏమాత్రం భయపడకుండా అలాగే పోనిచ్చాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది.
ఈ ఘటనపై ఎమ్‌ఎస్‌ఆర్టీసీ వైస్ ఛైర్మన్ శేఖర్ ఛన్నే స్పందిస్తూ.. ‘గడ్చిరోలీ నుంచి అహీరీకి బయలుదేరిన బస్సు పై కప్పుడు ఊడినా, ప్రయాణికులు అచిచినా ఏదీ పట్టించుకోకుండా అలాగే నడపడం మా దృష్టికి వచ్చింది. ప్రయాణికుల భద్రత ప్రతి ఉద్యోగి విధి. దీనిపై సమగ్ర విచారణకు ఆదేశించాం. ప్రయాణికుల భద్రత విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిబ్బందిపై తప్పకుండా చర్యలు తీసుకుంటాం’అని తెలిపారు. మరోవైపు ఈ ఘటనపై అహేరి డిపో అధికారి స్పందిస్తూ.. ‘బస్సు పై భాగం మొత్తం ఊడిపోలేదు.. కేవలం ముందు భాగంలో ఉన్న ఫైబర్ మాత్రమే ఊడిపోయింది’ ఈ విషయం డ్రైవర్ గమనించలేదని.. పక్కనే వస్తున్న వాహనదారులు చెప్పండంతో.. బస్సు సిబ్బందే వీడియో తీయాలని సూచించినట్లు విచారణలో వెల్లడైంది’ అని అన్నారు. ఈ ఘటనలో ఇద్దరు సిబ్బందిని సస్పెండ్ చేసినట్లు వెల్లడించారు.